"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు"
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్మీ కీలక ట్వీట్ చేశారు. ఇరాన్ లో అలీ ఖమేనీ మృతి తర్వాత భారత్ లో షియా ముస్లింలు చేసిన నిరసనలను వ్యతిరేకిస్తూ యాంకర్ రష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కామెంట్స్ తర్వాత తనకు త్రెట్ కాల్స్ వస్తున్నాయని రష్మీ పేర్కొన్నారు. మత గజ్జి పట్టిందంటూ తనను బూతులు తిడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె స్క్రీన్ షాట్స్ ను పోస్టు చేశారు.
మరోవైపు రష్మీ గౌతమ్ పై ఓ నెటిజన్ దారుణమైన కామెంట్ చేశాడు. మార్చి 8 మహిళా దినోత్సవం రోజు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో రష్మీకి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఆమె ఆ కామెంట్స్ చేసిన నెటిజన్ కు దిమ్మతిరిగేలా రిప్లై ఇచ్చారు. యాంకర్ రష్మీకి మల్లెమాల ప్రొడక్షన్స్ లోనూ అలాగే మరికొంతమందితోనూ అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ఇప్పుడు పతివ్రతలా నటిస్తోందంటూ ఆమెపై అసభ్యకరమైన రీతిలో పోస్ట్ పెట్టాడు. అయితే సాధారణంగా సోషల్ మీడియాలో ఇలాంటి వారు చేసే కామెంట్స్ కు సెలబ్రిటీస్ రెస్పాండ్ అవ్వురు..

కానీ రష్మీ చాలా యాక్టివ్ గా ఈ నెటిజన్ కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. ముందు నువ్వు అన్నదానికి ప్రూఫ్ చూపించని ఫైర్ అయ్యారు. నా వ్యక్తిగత జీవితంలో నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా, నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను గానీ, నీ తండ్రిని గానీ, నీ కొడుకును గానీ పెళ్లి చేసుకునేంత వరకూ, నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications