ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. గత 8 ఏళ్లుగా తనపై వ్యక్తిగతంగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్ లైన్ లో అటాక్ చేశారని ఆమె వాపోయారు. గత 24 గంటలుగా వేధింపులు మితిమీరిపోయాయని రష్మిక అన్నారు. తాను మాత్రమే కాకుండా తన ఫ్యామిలీని కూడా లాగారని ఆమె ఫైర్ అయ్యారు. ఇకపై ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. 24 గంటల్లో ఆ కంటెంట్ ను తొలగించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ ఎక్స్ వేదికగా ఆమె వార్నింగ్ ఇచ్చారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ రద్దు వార్తలపైనే ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు సమాచారం.
— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026
నేషనల్ క్రష్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా గత కొన్నేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులు, అసత్య ప్రచారాలపై ఆమె ఫైర్ అయ్యారు. ఇక ఇటీవల రష్మిక తల్లి కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు అసత్య ప్రచారం చేయడంపై ఆమె ఫైర్ అయ్యారు. కొందరు వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే గత 24 గంటల్లో జరిగిన కొన్ని పరిణామాలు మరీ హద్దు దాటాయని రష్మిక మండిపడ్డారు. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం జరిగిన ప్రైవేట్ ఆడియోను తననుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసి ఇప్పుడు లీక్ చేయడంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ వ్యవహారంలోకి తన కుటుంబ సభ్యులను కుడా లాగడం అత్యంత దురదృష్టకరమని ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోగా ఆ కంటెంట్ ను తొలగించకపోతే.. రేపటి నుండి చట్టపరమైన చర్యలు చేపడతానని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications