పెళ్లయ్యాక తొలి బర్త్‌డే.. పుట్టినరోజున రష్మిక అదిరిపోయే గిఫ్ట్!
Mysaa Movie: నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్‌డే సందర్భంగా ఆమె నటిస్తున్న పాన్-ఇండియా సినిమా 'మైసా' నుంచి విడుదలైన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నేడు 30వ వసంతంలోకి అడుగుపెట్టిన రష్మికకు, విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత ఇది మొదటి బర్త్‌డే కావడం విశేషం. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన రష్మిక లుక్.. ఆమె గత సినిమాలకు పూర్తి భిన్నంగా, అత్యంత భయంకరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రష్మిక 'రౌద్ర' రూపం
సాధారణంగా గ్లామరస్ పాత్రలు, కమర్షియల్ చిత్రాలతో మెప్పించే రష్మిక మందన్న.. ఈ సారి తన ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టి ఒక రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో రష్మిక ముఖమంతా మసి, దుమ్ము, రక్తంతో నిండి ఉంది. ముక్కు, నుదుటిపై ఉన్న లోతైన గాయాలు ఆమె పాత్ర పడే శారీరక కష్టాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయినప్పటికీ రష్మిక కళ్లలో కనిపిస్తున్న తీక్షణమైన చూపు, పౌరుషం.. ఈ సినిమాలో ఆమె పోషించబోయే యోధా పాత్ర తీవ్రతను చాటిచెబుతున్నాయి.

గోండు వీరనారిగా రష్మిక
అరంగేట్ర డైరెక్టర్ రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మైసా' సినిమాలో గోండు తెగల నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా. ఇందులో రష్మిక ఒక అడవి బిడ్డగా, భూమి కోసం పోరాడే వీరనారిగా కనిపించనుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆమె ఈ చిత్రం కోసం తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ కలయికతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోంది.
మైసా అంటే మామూలుగా ఉండదు..
ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, అంతర్జాతీయ స్టంట్ కోఆర్డినేటర్ ఆండీ లాంగ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ సినిమా 2026లో పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రష్మిక కెరీర్‌లోనే ఇది ఓ మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications