అమ్మాయిలూ.. ఆ విషయంలో అస్సలు సైలెంట్ గా ఉండొద్దు: నేషనల్ క్రష్ రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన రష్మిక మందన్న మూవీ టీం తో కలిసి సందడి చేశారు. ఇక ఈ సమయంలోనూ ఆమె డీప్ ఫేక్ వీడియోలపై తనదైన స్పందన తెలియజేశారు.

డీప్ ఫేక్ వీడియోలు కారణంగా తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కీలక విషయాలను చెప్పడంతో పాటు ముఖ్యంగా అమ్మాయిలకు ఒక సూచన చేశారు. అయితే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఈ విషయం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెబుతూనే, అమ్మాయిలకు సలహా ఇచ్చిన రష్మిక మందన్న ఏదైనా సంఘటన మనల్ని బాధించినప్పుడు కచ్చితంగా స్పందించాలని సూచించారు.

Rashmika mandanna suggestion to Girls.. dont be silent on any incident affects and hurts you!!

ఈ రోజుల్లో ఫేక్ వీడియోలు చాలా కామన్ గా మారిపోయాయి అని పేర్కొన్న రష్మిక, అలాంటివి బయటకు వచ్చినప్పుడు బాధపడుతూ, కుంగిపోవడం మానేసి వాటిపై స్పందించాలి అన్నారు. తనకు సంబంధించి వచ్చిన డీప్ ఫేక్ వీడియో తన మనసును ఎంతో గాయం చేసిందని, అయినప్పటికీ తాను స్పందించాను అన్నారు.

తనకు మొదట బిగ్ బి అమితాబ్ బచ్చన్ నుండి మద్దతు లభించిందని పేర్కొన్న ఆమె ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారన్నారు. మొదట్లో వీడియో చూసి తను చాలా బాధపడ్డాను అని పేర్కొన్న రష్మిక మందన్న చాలామంది సెలబ్రిటీలకు ఇలాగే జరుగుతుందని, కానీ మనం ఏం చేయగలమని తనలో తాను బాధపడ్డానని పేర్కొన్నారు. దీనిని సాధారణంగా తీసుకోకూడదని అనుకున్నానని, అందుకే ఈ విషయంపై స్పందించానన్నారు.

ఇక ఇదే సమయంలో అమ్మాయిలందరికీ తను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని పేర్కొన్న రష్మిక ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే మీరు అస్సలు సైలెంట్ గా ఉండొద్దని సూచించారు. కచ్చితంగా దానిపై స్పందించాలని తెలియజేశారు. అప్పుడు మీకు ప్రజల సపోర్టు లభిస్తుందని రష్మిక మందన్న పేర్కొన్నారు. మనం చాలా గొప్ప దేశంలో నివసిస్తున్నాము అని రష్మిక మందన్న స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+