రవితేజ 'ఇరుముడి' మూవీ మరో రికార్డు.. 80 లక్షలకు పైగా టికెట్స్ సేల్

మాస్ మహారాజ రవితేజ 'ఇరుముడి' సినిమా రికార్డులను తిరగరాస్తోంది. రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్నా థియేటర్ల వద్ద కోలాహలం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూల్లు రాబట్టిందీ చిత్రం. ఇరుముడి మూవీతో రవితేజ బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ హీరో అయినా రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా ఇప్పటి వరకూ చేరని రవన్న ఇప్పుడు ఏకంగా రూ. 200 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి టైర్ 1 హీరోగా ఎదిగారు. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి ఇరుముడి మూవీ బాక్సాఫీస్ వద్ద జోరును ప్రదర్శించింది. ఇరుముడి మూవీ తొలి వారంలోనే బాక్సాఫీస్ ఊచకోత ప్రారంభించింది.

ట్రేడ్ ఎనలిస్ట్ సాక్ నిక్ తెలిపిన లెక్కల ప్రకారం ఈ మూవీ తొలి రోజు రూ. 15.30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు రూ. 16.20 కోట్లు, మూడో రోజు సండే కావడంతో ఏకంగా రూ. 19 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. అలాగే నాలుగోరోజు రూ. 12. 35 కోట్లు, ఐదోరోజు రూ. 12. 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఆరో రోజు రూ. 10 కోట్లు, ఏడో రోజు రూ. 6 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద రవితేజ స్టామినాను నిరూపించింది. అలా ఫస్ట్ వీక్ లోనే ఏకంగా రూ. 93 కోట్ల వరకు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పటివరకూ ఒక్క నైజాంలోనే ఈ మూవీ ఏకంగా రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

RaviTeja irumudi movie Another record for Ravi Teja Irumudi movie Over 8 million tickets sold

ఇక బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లోనూ ఇరుముడి మూవీకి రికార్డు స్థాయిలో టికెట్ సేల్స్ అవుతున్నాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇందుకు సంబంధించిన వివరాలను పోస్టు చేసింది. ఈ మూవీకి ఇప్పటి వరకూ బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ కలిపి ఏకంగా 85 లక్షల టికెట్లు సేల్ అయినట్లు స్పష్టం చేసింది. విజయవంతంగా మూడో వారం రన్ అవుతూందని తెలిపింది. ఈ పోస్టర్ లో రవితేజ అయ్యప్ప మాల ధరించి తలపై ఇరుముడి పెట్టుకుని ఉన్నారు. ఈ మేరకు ఈ సినిమా జనరేషనల్ బ్లాక్ బస్టర్ అని పోస్టు చేసింది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+