సారీ తారక్.. ఆ సినిమా నాకు నచ్చలేదు: ప్రభాస్
పాన్ఇండియా డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పరిశ్రమలో అజాత శత్రువు. తనకు అందరూ మిత్రులేకానీ ప్రత్యర్థులు, శత్రులువు అంటూ ఎవరూ లేరు. సినిమా షూటింగ్ జరిగే సమయంలో యూనిట్ సభ్యులందరికీ తన ఇంటినుంచే భోజనం తెప్పిస్తాడు. తన మంచి మనసుతో అందరినీ తనవాళ్లగా చేసుకున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రం చేస్తున్నాడు. దీనితర్వాత స్పిరిట్ షూటింగ్ లో చేరతాడు. సలార్ 2 కూడా చేయాల్సి ఉంది. అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో నవరసాలను పలికించగలిగిదే జూనియర్ ఒక్కరే అని చెప్పొచ్చు. అందుకే ఆయన దర్శకులకు అభిమాన నటుడయ్యారు.
నాకు నచ్చలేదు.. ఏమీ అనుకోవద్దు
ప్రభాస్ కు, తారక్ కు పడదని, ఓ దర్శకుడివల్ల విభేదాలున్నాయనే వార్తలు తరుచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. కానీ అదంతా వాస్తవం కాదని వారిద్దరి సన్నిహితులు చెబుతుంటారు. అదంతా ఓ గాసిప్ మాత్రమే అంటారు. ప్రభాస్ తన కెరీర్ లో ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు చేసి తర్వాత వర్షం సినిమా చేస్తున్నారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా విడుదలైంది. ఓ సందర్భంలో బహిరంగంగా వేదికపై తనకు ఆ సినిమా నచ్చలేదని, సారీ అని, ఏమీ అనుకోవద్దంటూ ప్రభాస్ నేరుగా ఎన్టీఆర్ కు చెప్పేశారు.

మెంటల్ ఎక్కేసింది
ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి సినిమా చేశాడు తారక్. తర్వాత ఓ రోజు ప్రభాస్ ను పిలిచి ఈ సినిమా ప్రివ్యూ చూడాలంటూ తీసుకువెళ్లి చూపించాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ మైండ్ బ్లాక్ అయింది. తనకు మెంటల్ ఎక్కేసిందని, పిచ్చి ఎక్కిందని, స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసింది? భవిష్యత్తులో ఇతనితో అసలు సినిమానే చేయలేను అన్నాను.. కానీ ఆయనతోనే వరుసగా సినిమాలు చేశానంటూ ఓ వేదికలో ప్రభాస్ చెప్పారు. తన మనసులో మాట ప్రభాస్ చెప్పడంతో ఎన్టీఆర్ దాన్ని నవ్వుతూ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications