కదిలే ఇంద్ర భవనాన్ని కొన్న ముఖేష్ అంబానీ

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తాజాగా ఆయన ఓ ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేశారు. ఆయన దగ్గర ప్రైవేట్ జెట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు తొమ్మిది ఉండగా కొత్తగా కొన్నవాటితో కలిపి పది అయ్యాయి. బోయింగ్ 737 మ్యాక్స్ 9గా పిలిచే దీని విలువ రూ.వెయ్యి కోట్లు. దీన్ని కొన్న తర్వాత ముఖేష్ అంబానీ తన అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేపించబోతున్నారు. తన బిజినెస్ అవసరాల కోసం ఈ బోయింగ్ ను వినియోగించనున్నారు.

ఈ ప్రైవేట్ జెట్ నాన్ స్టాప్ గా 11,770 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం దీన్ని ఢిల్లీ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ సమీపంలోని నిర్వహణ టెర్మినల్ లో ఉంచారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్లలో ఒకటైన దీన్ని త్వరలోనే ముంబయిలోని రిలయన్స్ ప్రధాన కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. రెండు సీఎఫ్ఎంఐ లీప్ 18 ఇంజిన్ తో పని చేసే ఈ విమానం నెంబరు 8401 ఎంఎస్ఎన్. తన చిన్నకుమారుడి పెళ్లి కోసం వందల కోట్లరూపాయలను మంచినీళ్లల్లా ఖర్చుచేసిన ముఖేష్ అంబానీ ఏ పని చేసినా, ఏది కొనుగోలు చేసినా ఎంతో గ్రాండియర్ గా ఉండేటట్లు చూసుకుంటారు.

reliance chairman mukesh ambani purchase boeing 737 max 9

కొత్తగా కొనుగోలు చేసిన ఈ జెట్ కు సంబంధించి అన్ని ఫ్లయింగ్ పరీక్షలు పూర్తయ్యాయి. స్విట్జర్లాండ్ లోని యూరో విమానాశ్రయం బేసెల్ ముల్ హౌస్ ఫ్రీబర్గ్ లో రీమోడల్ చేశారు. స్విట్జర్లాండ్ తర్వాత బేసెల్, లండన్, జెనీవా, లుటన్ విమానాశ్రయాల్లోను పరీక్షలు చేపట్టారు. అన్నిరకాల పరీక్షలు పూర్తయిన తర్వాతే ఇది భారత్ లోకి అడుగుపెట్టింది. ముఖేష్ అంబానీ పనితీరు ఎలా ఉంటుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. బేసెల్ నుంచి న్యూఢిల్లీ రావడానికి తొమ్మిది గంటల సమయం పట్టింది. ఆ సమయంలో ఇది 6234 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ నాన్ స్టాప్ విమానంతో ఇక తన వ్యాపారాలను కూడా ముఖేష్ అంబానీ నాన్ స్టాప్ గా పరిగెత్తించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+