దేవుడు లేడు.. వినాయక చవితిపై రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.
రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రేణు దేశాయ్ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ యానిమల్స్, చిన్నపిల్లల కోసం ఫండింగ్ కలెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

తనకూ తోచినంత సాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళం అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటుంది. ఇదే సమయంలో తనపై ట్రోలింగ్ చేస్తోన్న పవన్ అభిమానులకు ఆమె తనదైనశైలిలో గట్టిగానే కౌంటరిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పులపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు. రేణు దేశాయ్ తాజాగా వినాయక చవితి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఆమె మాట్లాడుతూ.. "ఇప్పుడు అందరూ కూడా స్థాయిని చాటుకోవడం కోసం.. పెద్ద పెద్ద విగ్రహాలు, ఎక్కువ డెకరేషన్ అంటూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు.. నిజానికి అందులో దేవుడు లేడు.. మనిషి దురాశ.. అత్యాశ మాత్రమే ఉందని..వినాయక చవితి పండుగను రాను రాను దేవుడి స్థాయిని దిగజార్చేలా.. హీరో హీరోయిన్ల గెటప్పుల్లో విగ్రహాలను పెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమ్ము దుమారం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications