హీరోయిన్ జాకెట్‌పై పిచ్చి కూతలు..అందుకే వేసుకున్నావా అంటూ
ఓ మీడియా రిపోర్టర్ హీరోయిన్‌ను పిచ్చి ప్రశ్న అడిగాడు. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంది కాబట్టే స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకున్నావా..? అంటూ హీరోయిన్‌ను రిపోర్టర్ ప్రశ్నించాడు. సదరు హీరోయిన్ సైతం ఆ రిపోర్టర్‌కు గట్టిగానే కౌంటరిచ్చారు. మీడియా ప్రతినిధికి కౌంటరిచ్చిన హీరోయిన్ మరెవరో కాదు..ఐశ్వర్య రఘుపతి. న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఐశ్వర్య రఘుపతి ఆ తర్వాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2024లో విడుదలైన ధనుష్ నటించిన "కెప్టెన్ మిల్లర్" చిత్రంలో ఆమె ఒక పాత్రలో కనిపించారు.
ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఐశ్వర్య రఘుపతి ఇటీవల తన గ్రామంలో జరిగిన ఒక ఆలయ ఉత్సవంలో స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో చీర కట్టుకుని కనిపించారు.ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. గుడికి వెళ్లినప్పుడు ఎలాంటి దుస్తుల్లో వెళ్లాలో కూడా తెలియదా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆలయానికి వెళ్ళినప్పుడు ఇలాంటి దుస్తులు ధరించడం సరికాదని, ఇది సంస్కృతిని కించపరచడమే అంటూ ఆమెను గట్టిగానే ట్రోల్ చేశారు.

ఈ విమర్శలకు ధీటుగా, ఐశ్వర్యకు మద్దతుగా కూడా చాలా మంది ముందుకు వచ్చారు. వ్యక్తిగత దుస్తుల ఎంపిక అనేది వారి స్వేచ్ఛ అని, ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తి ముఖ్యమే కానీ, దుస్తులు కాదని వాదించారు. మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉందని, ఇతరులు వారి దుస్తులను బట్టి తీర్పు చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు ఆధునిక కాలంలో సాధారణమేనని, దీన్ని అనవసరంగా వివాదం చేయడమేనని కొందరు కామెంట్ చేశారు. ఈ ఘటన మరవక ముందే ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు ఐశ్వర్య రఘుపతి.
ఈ సందర్భంగా రిపోర్టర్ ఐశ్వర్య రఘుపతి వేసుకున్న స్లీవ్‌లెస్ బ్లౌజ్ గురించి ఎవరూ ఊహించని విధంగా ప్రశ్నించాడు. "మీరు ధరించిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ కూడా వేడిని తట్టుకునే ప్రణాళికలో భాగమేనా?" అంటూ ఐశ్వర్య రఘుపతిని ప్రశ్నించాడు.ఈ అనుచిత ప్రశ్నకు ఐశ్వర్య తీవ్ర ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యారు. ఆమె వెంటనే ఆ రిపోర్టర్‌ను ప్రశ్నిస్తూ, ఒక సినిమా కార్యక్రమం మధ్యలో తన దుస్తుల గురించి చర్చ ఎందుకు అని నిలదీశారు. ఆమె తన దుస్తుల ఎంపికపై ఇలాంటి ప్రశ్నలు అడగడం అనుచితమని, ఒక మహిళ తన ఇష్టానుసారం దుస్తులు ధరించే హక్కు ఉందని స్పష్టం చేశారు. "నా దుస్తులతో మీకేం పని?" అంటూ ఆమె ఘాటుగా సమాధానం చెప్పారు.












Click it and Unblock the Notifications