ఢిల్లీ నుంచి బీజేపీ డిక్లేర్ - ఇక తేల్చుకోవాల్సింది పవన్..!!

బీజేపీ అధినాయకత్వం తేల్చేసింది. దక్షిణాదిన పార్టీ బలోపేతం పైన బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు నిర్దేశం చేస్తోంది. ఇదే సమయంలో పొత్తుల పైనా కీలక మంత్రాంగం చేస్తోంది. బెంగాల్ తరహా ఫార్ములా అమలు చేస్తే సొంతంగా ఎదిగే అవకాశం ఉంటుందని విశ్వసిస్తోంది. ఇదే క్రమంలో పార్టీ నేతలకు రోడ్ మ్యాప్ ఫిక్స్ చేస్తోంది. బీజేపీ తాజా నిర్ణయంతో.. ఇప్పుడు పవన్ కల్యాణ్ తన నిర్ణయం ఏంటో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బీజేపీ అధినాయకత్వం ప్లాన్ పక్కాగా ఉంది. తెలంగాణలో తమ పార్టీ విధానం ఏంటో తేల్చేసారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని, రాబోయే రోజుల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో తెలంగాణ పార్టీ నేతలతో జరిగిన కీలక భేటీలో బీజేపీ భవిష్యత్తు వ్యూహాలపై క్లియర్ కట్ అప్‌డేట్ ఇచ్చారు. ఇకపైన ఏ రాష్ట్రంలోనైనా సరే ఒంటరిగా పోటీ చేసి, సొంతంగా అధికారంలోకి రావాలన్నదే తమ అంతిమ లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణ, పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్లాలనే పక్కా ప్లాన్‌తో ఉన్నామని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే మేము ఊహించని ఫలితాలు రాబట్టామని..దక్షిణాదిలో ఒంటరి పోరాటం ద్వారా అధికారం సాధించడం అసాధ్యమేమీ కాదని పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కొత్త కెప్టెన్, కావ్య తాజా నిర్ణయం వెనుక..!!
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కొత్త కెప్టెన్, కావ్య తాజా నిర్ణయం వెనుక..!!
BJP decided to Contest GHMC Elections Alone Rules Out Alliances in Telangana in Delhi meeting

బీజేపీ స్పెషల్ ఫోకస్.. పవన్ వాట్ నెక్స్ట్

అందులో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర రావు కీలక ప్రకటన చేసారు. గ్రేటర్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. జనసేనతో జాతీయ స్థాయిలో పొత్తు ఉన్నదని.. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏ పార్టీతోనే పొత్తు ఉండదన్నారు. జనసేన విషయం అధిష్టానం చూసుకుంటుందని తేల్చి చెప్పారు. ఆ పార్టీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా. తాము మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తామని వెల్లడించారు.

ఏపీ తరహా పొత్తులు తెలంగాణలో వద్దని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల కోసం జనసేన కార్యాచరణ ఖరారు చేస్తోంది. గ్రేటర్ లో ఏపీ నుంచి వచ్చిన వారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో బీజేపీతో కలిసి వెళ్లటం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేసారు. ఇప్పుడు బీజేపీ తమ వైఖరి తేల్చి చెప్పటంతో.. ఇక, పవన్ కల్యాణ్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+