'జైలర్ 2' లో రజనీకాంత్ తో నటించిన చిన్నారి రిత్విక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

సూపర్ స్టార్ రజనీకాంత్- కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలనం నమోదు చేసింది. 2023 లో వచ్చిన జైలర్ చిత్రానికి ఈ మూవీ కొనసాగింపుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండ్యన్ గా అలరించారు. అయితే ఈ మూవీలో రిత్విక్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ రజనీకాంత్ మనవడిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే రిత్విక్ రెమ్యూనరేషన్ ఎంత..? అనే దానిపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. జైలర్ 2 సినిమాలో కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నుంచి అనేకమంది పెద్ద పెద్ద స్టార్స్ నటించినా చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.

ఇక జైలర్ 2 మూవీలో రిత్విక్ సుమారు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం అందుతోంది. జైలర్ మూవీకి కూడా రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ మూవీకి భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జైలర్ 2 కు రజనీకాంత్ రెమ్యూనరేషన్ రూ. 110 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాక సినిమా బాక్సాఫీస్ రన్ ను దృష్టిలో ఉంచుకుని.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటే ప్రాఫిట్స్ ​ను కూడా రజనీకాంత్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే ఓవరాల్ గా తలైవాకు రూ. 180 కోట్ల వరకు అందనున్నట్లు సమాచారం అందుతోంది.

Rithvik the kollywood young boy who acted alongside Rajinikanth in the movie Jailer 2 was paid

ఇక జైలర్ 2 మూవీ ప్రస్తుతం థియేటర్లలో వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. ఈ మూవీ తెలుగులో 550 కు పైగా లోకేషన్లలో 650 స్క్రీన్లలో 1500 షోలు ప్రదర్శిస్తుండగా 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతోంది. అలాగే జైలర్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ బ్యానర్​ పై కళానిధి మారన్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+