ఢిల్లీ నిరసనలపై మోడీ కీలక వ్యాఖ్యలు- దసరా సంబరాల్లో ప్రసంగం..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఓవైపు విపక్షాలు, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ, ఇంకోవైపు విద్యార్థి సంఘాలు చేపడుతున్న నిరసనలపై ప్రధాని మోడీ (PM Modi) ఇవాళ స్పందించారు. నిరసనల వేళ మౌనం వహిస్తూ వస్తున్న ప్రధాని మోడీ.. ఇవాళ దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన దేశ శత్రువుల్ని గుర్తించి, ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఢిల్లీ హైకోర్టుకు సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్- అత్యవసర విచారణ..!
ఢిల్లీ హైకోర్టుకు సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్- అత్యవసర విచారణ..!

న్యూఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్ ఉత్సవ్ గ్రౌండ్‌లో జరిగిన దసరా వేడుకలకు హాజరైన ప్రధాని మోడీ.. శతాబ్దాల విదేశీ దండయాత్రలు, దోపిడీల తర్వాత భారతదేశం తన గుర్తింపును, వారసత్వాన్ని తిరిగి పొందుతోందన్నారు. అదే సమయంలో, శత్రువుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.శ్రీరాముని ఆదర్శాలను సజీవంగా ఉంచే సంప్రదాయం కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది ఎంతో మంది భారతీయులకు జీవశక్తి అన్నారు. ఈ సందర్భం కేవలం చెడుపై మంచి సాధించిన విజయానికి మించినదని, ఇది సత్యం, ధర్మం, సుపరిపాలనలకు గుర్తుగా నిలుస్తుందన్నారు.

PM Modi Calls for Identifying and Defeating Enemies of India in Dussehra Address
కేంద్రమంత్రి రాజీనామా వెనుక బాలీవుడ్ నటికి వేధింపులు? అసలేం జరిగింది ?
కేంద్రమంత్రి రాజీనామా వెనుక బాలీవుడ్ నటికి వేధింపులు? అసలేం జరిగింది ?

రామరాజ్యం అంటే ప్రజలందరికీ మేలు చేకూర్చే పాలన అని, ఇక్కడ ఎవరికీ వివక్ష ఉండదన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయన్నారు. అధికారం అంటే పాలించడం కాదు, ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం అని అర్థమని ప్రధాని తెలిపారు. ఇదే శ్రీరాముని ఆదర్శమన్నారు. అందుకే, ప్రజలను దైవ స్వరూపులుగా భావించి, మనం ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పేదలు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమమేనని మోడీ తెలిపారు. భారతీయులందరూ ఎవరి సహాయంపై ఆధారపడకుండా, కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలందరి సంక్షేమానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. మన వనరులపై మనకు నమ్మకం ఉండాలని, మన సంకల్పాన్ని శక్తిగా మార్చుకుని, కఠిన శ్రమ ద్వారా సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలన్నారు. అంతిమంగా భారతదేశ శత్రువులను మనం ఓడించాలన్నారు. అయితే ప్రధాని ప్రసంగంలో ఎక్కడా కాక్రోచ్ జనతా పార్టీ గురించి కానీ, విపక్షాల గురించి కానీ నేరుగా ప్రస్తావించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+