ఢిల్లీ హైకోర్టుకు సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్- అత్యవసర విచారణ..!

ఢిల్లీ జంతర్ మంతర్ ను నిరసనల ప్రాంతంగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఆంక్షలు ఉల్లంఘించి జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వీరి జ్యుడిషియల్ కస్టడీ ముగిసినా మరో రెండు రోజుల పాటు దాన్ని పొడిగిస్తూ స్థానిక మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను వారు హైకోర్టులో సవాల్ చేశారు. అలాగే తమ పిటిషన్ పై అత్యవసర విచారణ కోరారు.

కాక్రోచ్ ల తిరంగా మార్చ్ పై ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం-జూలై 20 రిపీట్ కాకుండా..!
కాక్రోచ్ ల తిరంగా మార్చ్ పై ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం-జూలై 20 రిపీట్ కాకుండా..!

కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో వీరిని ఐదు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వీరిని తీహార్ జైలుకు తరలించారు. జైల్లోనూ వీరికి వేర్వేరు బ్యారెక్స్ కేటాయించారు. అనంతరం వీరు తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు. అయితే వీరు దాఖలు చేసుకున్న పిటిషన్ పై రెండు రోజుల పాటు విచారణ జాప్యం చేస్తూ వచ్చిన మెజిస్ట్రేట్ చివరికి రెండు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. దీంతో వీరు పండుగ రోజు కూడా జైల్లోనే ఉండాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. ఈ పరిణామాలతో కాక్రోచ్ జనతా పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఆందోళనల్ని దీపావళి వరకూ వాయిదా వేసింది.

CJP Leaders Saurav Das Ashutosh Ranka Move Delhi High Court Seek Urgent Night Hearing
తీహార్లో జైల్లోనే సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్..! కస్టడీ ముగిసినా తేల్చని కోర్టు..!
తీహార్లో జైల్లోనే సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్..! కస్టడీ ముగిసినా తేల్చని కోర్టు..!

అయితే పండుగ సందర్భంగా కుటుంబాలతో కలిసి గడిపే అవకాశం కోల్పోతున్న సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను విడుదల చేయాలని కోరుతూ కాక్రోచ్ పార్టీ లీగల్ విభాగం ఇవాళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టును కోరింది. దీనిపై కాసేపట్లో హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి కల్లా వీరిద్దరికీ విధించిన జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరపాలని లాయర్లు కోరారు. దీంతో ఇవాళ రాత్రికి విచారణ జరిపి వీరికి ఊరటనిస్తారా లేక కస్టడీ రేపటి వరకూ పొడిగించారు కాబట్టి, జోక్యం చేసుకోబోమని హైకోర్టు చెప్పేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+