కొడుక్కి బర్త్‌డే గిఫ్ట్‌గా తుపాకీ.. అదే గన్‌తో స్కూల్‌లో నలుగురి హత్య!

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల టీనేజర్ తన తల్లి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చిన తుపాకీతో ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడి దారుణంగా కాల్పులు జరిపాడు. ఈ ఘోరదాడిలో ముగ్గురు చిన్న పిల్లలోత పాటు ఓ ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో విద్యార్థి, ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు.

మెక్సికో పేరు మార్చాల్సిందే.. ట్రంప్ సంచలన డిమాండ్!
మెక్సికో పేరు మార్చాల్సిందే.. ట్రంప్ సంచలన డిమాండ్!

ఒరెగాన్‌లోని బెండ్ నగరంలో ఉన్న 'సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్'వద్ద గత గురువారం ఈ దారుణం జరిగింది. నిందితుడిని గ్రిఫిన్ జె.జాన్ II(16)గా గుర్తించారు. ఇతడు గతంలో ఇదే పాఠశాలలో ప్రత్యేక అవసరాల విద్యార్థిగా చదివినట్లు సమాచారం. నిందితుడి తల్లి షాంటాయ్ నికర్సన్ ఆగస్టు 2026లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 12-గేజ్ పంప్-యాక్షన్ షాట్‌గన్‌ను సరదా వినియోగం కోసం తన కుమారుడికి బహుమతిగా ఇచ్చినట్లు పోలీసు విచారణలో తెలిసింది.

Oregon School Shooting in America Teen Kills Four With Shotgun Gifted by His Mother Full Details

దాడి జరిగిన రోజున నిందితుడు మొదట బయట వెళ్తున్న ఓ పికప్ ట్రక్కుపై కాల్పులు జరిపి ఆ తర్వాత పాఠశాల తాళం వేసి ఉన్న గాజు తలుపులను తుపాకీతో కాల్చి లోపలికి ప్రవేశించాడు. నేరుగా ఓ తరగతి గదిలోకి వెళ్లి అక్కడ ఉన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఐదేళ్ల రోమ్ సమ్మర్ అనే చిన్నారితో పాటు 8, 11 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు పిల్లలు, 25 ఏళ్ల ఉపాధ్యాయురాలు మేగన్ లాంబెర్ట్ అక్కడికక్కడే మరణించారు.

శునకంపై అమానుషం.. వయాగ్రా వాడానంటూ నిందితుడి వింత వాదన!
శునకంపై అమానుషం.. వయాగ్రా వాడానంటూ నిందితుడి వింత వాదన!

అయితే పాఠశాల బయట కాల్పుల శబ్ధం విన్న కేలబ్ గియామ్యాంకో(36) అనే స్థానికుడు వెంటనే లోపలికి వచ్చి టీచర్‌తో పోరాడుతున్న నిందితుడు జాన్‌ను తన వద్ద ఉన్న తుపాకీతో కాల్సి చంపేశాడు. దాంతో మరింత ప్రాణనష్టం తప్పింది. కేలబ్ పిల్లలు కూడా అదే పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా.. పాఠశాల భద్రతా లోపాలు, మైనర్‌కు తుపాకీ అందుబాటులోకి వచ్చిన విధానంపై బాధితుల కుటుంబాలు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+