ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ సెలెక్షన్: డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్!
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్ఢీవో) ఆధ్వర్యంలోని 'డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(DRDE)' గ్వాలియర్, విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకమైన పెయిడ్ ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా నేరుగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు డీఆర్డీవో సీనియర్ సైంటిస్టులతో కలిసి 6 నెలల పాటు కీలకమైన ప్రాజెక్టులపై పనిచేసే సువర్ణావకాశం పొందుతారు. ఇది భవిష్యత్తులో డిఫెన్స్ లేదా రీసెర్చ్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ ఇంటర్న్‌షిప్‌ను 6 నెలల కాలపరిమితికి గాను అందిస్తున్నారు. సెలెక్ట్ అయిన విద్యార్థులకు నెలకు రూ.5 వేల చొప్పున మొత్తం 6 నెలలకు రూ.30,000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో బయోలాజికల్ సైన్సెస్(3 ఖాళీలు), కెమికల్ సైన్సెస్(3 ఖాళీలు), ఇంజనీరింగ్(2 ఖాళీలు) ఉన్నాయి.

అర్హతలు ఇవే..
* ఆయా సబ్జెక్టులలో ఎమ్మెస్సీ(3వ/4వ సెమిస్టర్) లేదా బీటెక్(7వ/8వ సెమిస్టర్) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. *విద్యార్థులు తమ అకాడమిక్ కెరీర్లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి.
*అలాగే 2026 నవంబర్ 14 నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలి.
ఈ ఇంటర్న్‌షిప్‌కు సెలెక్షన్ ప్రక్రియ దరఖాస్తుదారుల విద్యార్హతలు, మార్కుల ఆధారంగానే ఉంటుంది. అవసరమైతే టెలిఫోనిక్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే డిసెంబర్ 1, 2026న ఆఫర్ లెటర్లు పంపుతారు. ఈ ఇంటర్న్‌షిప్ 2027 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in నుంచి నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం పూర్తిగా ఆఫ్‌లైన్, ఈమెయిల్ ద్వారా అందుబాటులో ఉంది. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, స్పాన్సర్‌షిప్ లెటర్ వివరాలతో కూడిన రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికేట్ల సెల్ఫ్ అటెస్టెడ్ లెటర్లు, బ్యాంక్ వివరాలను జత చేయాలి. పూర్తి చేసిన ఫారమ్‌ను 'డైరెక్టర్, డీఆర్డీఈ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఝాన్సీ రోడ్, గ్వాలియర్, మధ్యప్రదేశ్, పిన్ కోడ్-474002' అనే చిరునామాకు తపాలా ద్వార పంపవచ్చు. లేదా భర్తీ చేసిన పత్రాలను స్కాన్ చేసిన స్కాన్ చేసి [email protected], [email protected] ఈమెయిల్ ఐడీలకు పంపవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 14, 2026.














Click it and Unblock the Notifications
