'సూపర్ హీరో' అవతారంలో టాలీవుడ్ యంగ్ హీరో.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో..!
టాలీవుడ్ లో విభిన్నమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్ లాంటి చిత్రాలతో కెరీర్ తొలినాళ్లలో హిట్స్ అందుకున్నారాయన. ఆ తర్వత జెంటిల్ మాన్, అమీతుమీ, సమ్మోహనం లాంటి బ్రీజీ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్స్ తో అలరించారు.
ఆ తర్వాత వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, సారంగపాణి జాతకం లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఓ సూపర్ హీరో సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు రోషన్ మేకా హీరోగా ఒక మైథలాజికల్ ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం అందుతోంది.
తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం అవుతోంది. ఈ మూవీలో రోషన్ సరసన హీరోయిన్ గా రేఖా పాండే నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకా ప్రస్తుతం 'ఏమో ఏమో ఇది' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంలో రోషన్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక గతేడాది ఛాంపియన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు హీరో రోషన్. ఈ మూవీ తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ మూవీలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. పెళ్లి సందడి సినిమాతో రోషన్ సినీ కెరీర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
