Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ!

స్టార్ హీరోయిన సాయి పల్లవి కెరీర్‌ను గమనిస్తే నిజంగా స్ఫూర్తిదాయకమే. ఢీ వంటి డ్యాన్స్ రియాలిటీ షోలలో తన అద్భుతమైన నాట్యంతో టైటిల్ విజేతగా నిలిచిన ఈ నాట్యమయూరి అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుంచే నటనపై మక్కువ ఉన్నప్పటికీ.. చదువుకు ప్రాధాన్యతనిచ్చి డాక్టర్ కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత మలయాళ సినిమా "ప్రేమమ్"లో మలర్ టీచర్ పాత్రతో వెండితెరకు పరిచయమై.. దక్షిణాదిలో ఓ సంచలనం సృష్టించింది. తెలుగులో "ఫిదా" చిత్రంతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ కుర్రకారు మనసు గెలుచుకోవడంతో పాటు అనతి కాలంలోనే 'లేడీ పవర్ స్టార్' అనే గుర్తింపును సొంతం చేసుకుంది.

బాలీవుడ్ ఎంట్రీ.. సీతగా అలకించనున్న సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి 'ఏక్ దిన్' అనే సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. దీనితో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రామాయణం' సినిమాలో సీతమ్మ పాత్రలో నటిస్తూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళంలో ధనుష్ సరసన కూడా ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తూ అత్యంత బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

Sai Pallavi Wedding Twist Lady Powerstar Clarifies Marriage Rumors Currently Focusing on Career

పెళ్లిపై సాయి పల్లవి క్లారిటీ!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవికి ఇటీవల ఓ కార్యక్రమంలో పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురైంది. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి ప్రశ్నలకు దాటవేసే సమాధానాలు ఇస్తుంటారు. కానీ సాయిపల్లవి చాలా స్పష్టంగా స్పందించింది. తన పెళ్లి గురించి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ సాయి పల్లవి ఇచ్చిన క్లారిటీ అభిమానులను, ముఖ్యంగా ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది.

లేడీ పవర్ స్టార్ పెళ్లిపై ఏం చెప్పింది?
సాయి పల్లవి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. "ప్రస్తుతానికి నేను కెరీర్‌పై మాత్రమే పూర్తిగా ఫోకస్ పెట్టాను. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పట్లో అస్సలు లేదు. నేను ప్రస్తుతం పక్కా సింగిల్" అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. తన చెల్లెలు పూజా కన్నన్‌కు రెండేళ్ల క్రితమే దగ్గరుండి పెళ్లి జరిపించిన సాయి పల్లవి.. తన విషయంలో మాత్రం ఇంకా సమయం ఉందని తేల్చి చెప్పేసింది.

ఫ్యాన్స్ రియాక్షన్
సాయి పల్లవి వయస్సు ప్రస్తుతం 33 ఏళ్లు కాగా.. ఈ వయసులో కూడా ఆమె పెళ్లికి దూరంగా ఉండి కేవలం సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుండటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి సింగిల్ గా ఉండటం తమకు ఇష్టమేనని కొందరు పురుష అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమె పెళ్లి వార్త ఎప్పుడు వింటామా అని ఎదురుచూస్తున్నారు. మొత్తానికి పెళ్లిపై సాయి పల్లవి ఇచ్చిన ఈ ట్విస్ట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+