మీడియా ముందుకు సమంత
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా సమంత పరిచియం అయింది. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది. విజయ్ , సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తరువాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరం ఉన్నారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు.

అయితే ఆరోగ్యం నుంచి కోలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. డిసెంబర్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత చాలాకాలం తర్వాత హైదరాబాద్‌కు రానుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'జిగ్రా'.ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే అక్టోబర్ 8న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్నారు.ఆమెతో పాటు, డైరెక్టర్ త్రివిక్రమ్, రానా దగ్గుబాటి కూడా ఈవెంట్‌కు రాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.దాదాపు ఏడాదిన్నర తర్వాత అలియా భట్ కోసం సమంత మీడియా ముందుకు రాబోతుంది.












Click it and Unblock the Notifications