హాస్పిటల్ బెడ్‌పై పడి ఉన్న సమంత
హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. ఆ తరువాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు. మయసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్న తాను కోలుకున్నట్టు సమంత తెలిపింది. ఆరోగ్యం నుంచి కోలుకోవడంతో సమంత తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ఆమె వెండితెర మీద కనిపించి సంవత్సరం దాటి పోయింది. అయినా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో సమంత స్కిన్ ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చికిత్సకు సంబంధించిన విషయాలను ఆమె సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు గాయం కావడం అభిమానులు ఒకింత బాధకు గురి చేసింది. అయితే సమంతకు నిజంగా గాయాలు అయ్యాయ లేక ట్రీట్ మెంట్ పేరుతో ఇలా రెస్ట్ తీసుకుంటుందో అర్ధం కావడం లేదు. సమంత ప్రస్తుతం 'సిటాడెల్ హనీ బన్నీ'అనే సినిమాలో నటిస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెకరకెక్కింది. సమంతకు జంటగా వరుణ్ ధావన్ కనిపించనున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటోంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications