నా లైఫ్‌లో మళ్లీ అలాంటి రోజులు మాత్రం రాకూడదు : సమంత
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం విషాదంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. వెండితెరపై నాగ చైతన్య , సమంత హిట్ పెయిర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. ఏం మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత అనారోగ్యం పాలయ్యారు. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ కొద్దిరోజులు సినిమాలకు సైతం దూరం అయింది. వ్యాధి నయం కావడంతో తిరిగి సినిమాల్లో నటిస్తోంది.

మరోవైపు నాగ చైతన్య మాత్రం హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో సైలెంట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. కొంత కాలంగా వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో శోభితా ధూళిపాళ్ల, నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారాలను నిజం చేస్తూ వీరిద్దరు నిశ్చితార్థం చేసుకుని సినీ అభిమానులకు షాకిచ్చారు. గురువారం నిశ్చితార్ధంతో శోభితా ధూళిపాళ్ల, నాగ చైతన్య ఒకటయ్యారు.
వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సమంత అభిమానులు నాగ చైతన్యపై మండిపడుతున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్‌గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో సమంత గతంలో మాట్లాడిన విషయాలను వారు గుర్తు చేస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని సమంత వెల్లడించారు.గడిచిన రోజులు నా లైఫ్ లోకి రాకూడదని కోరుకుంటున్నానని సమంత వెల్లడించారు.ప్రస్తుతం అంతా బాగానే ఉందని మునుపటి రోజుల కంటే బలంగా అయ్యానని సామ్ పేర్కొన్నారు.ఆ చీకటి రోజుల నుంచి బయటపడితే లైఫ్‌లో విజయం సాధిస్తామని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నాగ చైతన్యతో జీవించిన కాలం గురించే సామ్ ఇలా ఇన్ డైరెక్ట్‌గా కామెంట్స్ చేసిందనే విషయాన్ని ఆమె అభిమానులు గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications