ఓటీటీలోకి లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
ఇటీవలి కాలంలో థియేటర్లలో విడుదలైన చాలా సినిమాలు ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్నాయి. ఒకటి.. రెండు.. సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. ఇక యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలను ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అని ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య ఇటీవల థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దుమ్ముదుళిపిన సినిమాల్లో సమంత 'మా ఇంటి బంగారం' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. స్టార్ హీరో సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ సంచలన విజయం సాధించడం విశేషం. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లు కొల్లగొట్టి సమంతా స్టామినా ఏంటో నిరూపించింది.
'మా ఇంటి బంగారం' మూవీకి ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పట్టారు. సమంత ప్రధాన పాత్రలో నటించడంతో లేడీ ఫ్యాన్స్ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటారు. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను ఈ మూవీ సొంతం చేసుకుంది. కుటుంబ కథకు యాక్షన్, ఎమోషన్ ను జోడించి రూపొందిన ఈ చిత్రం సమంత సినిమా కెరీర్ లోనే అత్యంత భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాక రూ.100 కోట్ల క్లబ్ లో మొట్టమొదటి ఫీమేల్ లీడ్ సినిమాగా 'మా ఇంటి బంగారం' మూవీ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సమంత సొంత ప్రొడక్షన్ కంపెని ట్రాలాలా బ్యానర్ నిర్మించింది.

దర్శకురాలు నందిని రెడ్డితో సమంతకు ఇది వరుసగా మూడో సినిమా కావడం మరో విశేషం. వీరిద్దరి కాంబోలో ఇదివరకు వచ్చిన జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 'మా ఇంటి బంగారం' మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ ను కూడా నిర్మించనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ దక్కించుకుంది. అలాగే జూలై 17 నుంచి 'మా ఇంటి బంగారం' సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వాళ్లు ఇక ఇంట్లోనే ఓటీటీ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. మరి ఓటీటీలో ఇంకెన్ని రికార్డుల్ని ఈ మూవీ నమోదు చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications