ఏఐ పేరును పూర్తిగా మార్చేసిన ట్రంప్. వైట్‌హౌస్‌లో కొత్త నామకరణం..

ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరును మారుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై దీనిని 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' అని పిలవకుండా 'సూపర్ ఇంటెలిజెన్స్' గా పిలవాలని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ టెక్నాలజీ పరిధి కేవలం కృత్రిమమనే పదం పరిధిలో ఉండేది కాదని, దీని అద్భుతమైన సామర్థ్యాలు, భవిష్యత్ అవకాశాలను ప్రతిబింబించేలా ఈ పేరు మారుస్తున్నట్లు వైట్‌హౌస్ స్పష్టం చేసింది. చైనాతో పోటీలో అమెరికాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వేగవంతమైన వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీల సీఈవోలతో ట్రంప్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మాన్, ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడై, మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్, స్పెస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఐ భద్రతపై టెక్ దిగ్గజాలంతా ఒకే తాటిపైకి వచ్చారు.

US President Donald Trump Renames Artificial Intelligence to Super Intelligence During White House Meeting

'నైతిక బంధన' రూపంలో స్వచ్ఛంద భద్రతా ఒప్పందం

చట్టపరంగా కఠినమైన నిబంధనలు కాకుండా, టెక్ కంపెనీలు తమంతట తాముగా భద్రతా ప్రమాణాలు పాటించేలా ఒక 'నైతిక బంధన' (Morally Binding) ఒప్పందంపై ఈ దిగ్గజాలు సంతకాలు చేశాయి. ఏఐ వ్యవస్థలు మరింత శక్తివంతంగా మారుతున్న తరుణంలో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కంపెనీలే స్వయంగా పర్యవేక్షించుకోవాలని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. ఇది చట్టబద్ధమైనది కాకపోయినా, అమెరికా భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.

అంత్యక్రియలకు 'ఏఐ' ముహూర్తం.. తర్వాత అదే కంపెనీపై కేసు!
అంత్యక్రియలకు 'ఏఐ' ముహూర్తం.. తర్వాత అదే కంపెనీపై కేసు!

నాలుగు అంచెల పటిష్టమైన భద్రతా విధానం

టెక్ కంపెనీలు అమలు చేయాల్సిన భద్రతా మార్గదర్శకాలపై వైట్‌హౌస్ ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించింది. దీని ప్రకారం ప్రతి కంపెనీ నాలుగు అంచెల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి:

  • ఇంటర్నల్ కంట్రోల్: ఏఐ మోడల్స్ శిక్షణ దశలోనే సైబర్‌ సెక్యూరిటీ, బయోసెక్యూరిటీ ప్రమాదాలను నివారించేలా పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలి.
  • స్పెషల్ టీమ్స్: భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఇంటర్నల్ టీమ్స్ పనిచేయాలి.
  • ఎక్స్‌టర్నల్ ఆడిట్: నిపుణులతో కూడిన స్వతంత్ర ఎక్స్‌టర్నల్ ఆడిటర్ల ద్వారా భద్రతా విధానాలపై స్వతంత్ర అంచనాలు వేయించాలి.
  • బోర్డు పర్యవేక్షణ: డైరెక్టర్ల బోర్డు నుంచి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఈ ఆడిట్ నివేదికలను పరిశీలిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.
AI: కొంపలేమీ మునగవు! వినాశనానికి ఛాన్స్ లేదు: Nvidia CEO
AI: కొంపలేమీ మునగవు! వినాశనానికి ఛాన్స్ లేదు: Nvidia CEO

డేటా సెంటర్ల విస్తరణపై వ్యక్తమవుతున్న ఆందోళనలు

ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భారీ డేటా సెంటర్ల అవసరం విపరీతంగా పెరిగింది. అయితే దీనివల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, నీటి వనరులపై భారం పడుతుండటంతో స్థానిక ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సమస్యపై స్పందించిన ట్రంప్.. టెక్ కంపెనీలు తమ డేటా సెంటర్లు ఏర్పాటయ్యే స్థానిక కమ్యూనిటీలకు అండగా ఉంటాయని, స్థానిక పాఠశాలల అభివృద్ధికి, విద్యారంగానికి భారీగా సాయం చేస్తాయని భరోసా ఇచ్చారు. సాంకేతిక ఆవిష్కరణలు, భద్రత రెండూ సమాంతరంగా ముందుకు వెళ్తాయని టెక్ దిగ్గజాలు ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+