టీ20 సెమీ ఫైనల్స్ చేరిన భారత్, పాకిస్తాన్

జపాన్‌లోని నిస్సిన్ వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్ లో భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. పరిస్థితులు ప్రతికూలంగా మారడం వల్ల కనీసం టాస్ వేయడానికి కూడా వీలుపడలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న భారత్ నేరుగా సెమీఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

నిస్సిన్ కొరొగి స్పోర్ట్స్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇక్కడ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల అవుట్‌ఫీల్డ్ మొత్తం కూడా చిత్తడిగా తయారైంది. స్టేడియం మొత్తం వాన నీటితో నిండింది. మ్యాచ్ నిర్వహించడానికి ఏ మాత్రం అనుకూలించలేదు. కనీసం అయిదు ఓవర్లకు కుదించిన మ్యాచ్ ఆడించడానికి వాతావరణం సహకరించని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

India and Pakistan reach Semi Finals As Quarter Final Abandoned in Persistent Rain Japan Asia Games

భారత్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. హాంగ్‌కాంగ్‌తో జరగాల్సిన పాక్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దు కాగా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ ఆధారంగా పాకిస్తాన్‌ సెమీస్ కు చేరింది. దీంతో ఈ రెండు జట్లు కూడా నాకౌట్ దశ నుంచి నేరుగా సెమీస్ చేరినట్టయింది.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా టీమిండియా మాజీ స్టార్..: జహీర్ ఖాన్ మార్క్ ఎంపిక
చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా టీమిండియా మాజీ స్టార్..: జహీర్ ఖాన్ మార్క్ ఎంపిక

ఆసియా గేమ్స్ లో క్రికెట్ మ్యాచ్ ల నిబంధనల ప్రకారం.. నాకౌట్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయితే మెరుగైన సీడింగ్ లేదా ఐసీసీ ర్యాంకింగ్స్ ఉన్న జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. అదే ఇప్పుడు ఈ రెండు జట్లకూ వర్తించింది. ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన టీమిండియా.. వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. 2023లో చైనా హాంగ్‌జౌలో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత జట్టు స్వర్ణ పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

సెమీస్ పోరులో భారత జట్టు ఎవరితో తలపడుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. శ్రీలంక, నేపాల్ మధ్య జరిగే మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో భారత్ సెమీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక వైపు మొగ్గు చూపుతున్నాయి గణాంకాలు. ఇప్పుడు దీని మీదే అందరి చూపూ నిలిచింది. సెమీస్ లో భారత్, పాకిస్తాన్ తమ తమ ప్రత్యర్థులను ఓడించగలిగితే.. ఈ రెండు చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫైనల్ మ్యాచ్ ను చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+