నాగ చైతన్య, శోభితల సీక్రెట్ లవ్ ఎప్పటి నుండో బయటపెట్టిన సమంత!!
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితల నిశ్చితార్థం జరిగి రెండురోజులు అవుతున్నా జనాలు మాత్రం వీరిద్దరి నిశ్చితార్థం గురించి, వీరిద్దరి లవ్ గురించే పెద్దఎత్తున చర్చ చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పటి నుంచి మొదలైంది? వీరిద్దరూ ఎప్పటినుంచి కలుసుకుంటున్నారు? నాగచైతన్యతో సమంత కలిసి ఉన్న రోజుల్లోనే వీరి మధ్యలో ఎఫైర్ నడిచిందా? ఇట్లాంటి అనేక రకాల ప్రశ్నలు నెటిజెన్లకు నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ తో ఉత్పన్నమవుతున్నాయి.
నాగచైతన్య హీరోయిన్ సమంతని 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరి వివాహ బంధం నాలుగేళ్లకే ముక్కలైంది. 2021 అక్టోబర్ 2వ తేదీన పరస్పర అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో నాగచైతన్య సమంతల అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. దీని తర్వాత ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయినప్పటికీ అప్పుడప్పుడు సమంత నాగచైతన్య తో తన అనుబంధాన్ని గుర్తు చేస్తుంది సమంత.

సమంత డిప్రెషన్ లో.. నాగ చైతన్య లవ్ లో
తమ వివాహ బంధానికి సంబంధించి, తన హార్ట్ బ్రేక్ అయిన అనేక అంశాలకి సంబంధించి పరోక్షమైన పోస్టులు పెట్టి నాగచైతన్యతో రిలేషన్ ను పదేపదే గుర్తు చేస్తుంది సమంత. ఇలా ఉంటే గత కొన్నాళ్లుగా నాగచైతన్య శోభిత రిలేషన్ గురించి పెద్దఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరూ డైటింగ్ చేస్తున్నట్టు లవ్ లో ఉన్నట్టు ప్రచారం జరగగా, తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడంతో పుకార్లు నిజమని ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
ఇన్స్టా పోస్ట్ తో సీక్రెట్ బయటపెట్టిన సమంత
అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నిజమేనని 2022లోనే శోభిత చెల్లి సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ తో బయటపెట్టింది. చైతు, శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేసి ఈ విషయాన్ని బయట పెట్టిన సమంత 2022లోనే సమంత ధూళిపాళ్ల చేసిన ఒక పోస్టుకు చైతు లైక్ కొట్టాడని పేర్కొంది.
శోభిత ధూళిపాళ్ల చెల్లి సమంత కొత్త సీక్రెట్
కాకపోతే ఈ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని ఒకవేళ సరిగ్గా గమనించి ఉంటే శోభితతో ప్రేమ వ్యవహారం అప్పుడే బయటపడేదేమో అని అంటూ సమంత చేసిన పోస్ట్ తో మరో కొత్త చర్చ మొదలైంది. ఏది ఏమైనాప్పటికీ శోభిత దూళిపాళ్ల నాగచైతన్యల మధ్య ప్రేమ వ్యవహారానికి సంబంధించి శోభిత ధూళిపాళ్ల చెల్లి సమంత కొత్త సీక్రెట్ రివీల్ చేసింది.












Click it and Unblock the Notifications