సమంత సంచలన పోస్ట్..అతనికి శిక్షపడాలి..పడుతుంది
హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తన సినిమాలతో పాటు, వ్యక్తిగత కారణాలతో సమంత వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. ఈక్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్ సిరీస్ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.హీరో వరుణ్ ధావన్‌తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత రెచ్చిపోయి నటించారు. తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు.

హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.దీంతో సమంత రెండో పెళ్లిపై అనేక గాసిప్స్ తెర మీదకు వస్తున్నాయి.సమంత ఓ స్టార్ దర్శకుడుతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాజు నిడుమోరు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు. రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ ప్రచారంపై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ ఘటనపై రియాక్ట్ అయ్యారు.ర్యాగింగ్ వల్ల మరణించిన ఓ విద్యార్థి గురించి సమంత స్పందించారు.జనవరి 15న తోటి విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ బాలుడికి న్యాయం జరగాలని, బాధ్యులకు శిక్ష పడాలని సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలు, ప్రముఖులు,నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ విద్యార్థి మరణంపై సమంత సైతం రియాక్ట్ అయింది.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమంత డిమాండ్ చేశారు.అలాగే, ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటికి మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి అని సమంత ఓ నోట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications