తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై సమంత సంచలన కామెంట్స్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని హేమ కమిషన్ నివేదికలో పేర్కొంది. తాజాగా దీనిపై హీరోయిన్ సమంత రియాక్ట్ అయ్యారు. హేమ కమిషన్ నివేదికపై సమంత తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Samantha s Sensational Comments on Casting Couch

మలయాళ ఇండస్ట్రీలో మహిళలు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, పలు కీలక సూచనలు చేసిన హేమ కమిషన్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ చాలా బాగా పని చేసిందని ప్రశంసించారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో మహిళా నటీమణులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని సమంత కోరారు.

అసలు తెలుగు ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని మొట్ట మొదటిసారి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పింది నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత శ్రీరెడ్డి వ్యవహారం దారి తప్పడంతో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ మరుగున పడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+