రికార్డులు సృష్టిస్తోన్న 'సంక్రాంతికి వస్తున్నాం'
విక్టరీ వెంకటేష్ , దర్శకుడు అనిల్ రావిపూడి కాంబో గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వీరి కాంబినేషన్‌లో ఎఫ్2, ఎఫ్3 వంటి సినిమాలు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. మరోసారి వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎఫ్2, ఎఫ్3 సినిమాల తర్వాత వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో 'సంక్రాంతికి వస్తున్నాం'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సంక్రాంతికి కుటుంబ సభ్యులందరూ కలిసి చూడదగిన సినిమాగా 'సంక్రాంతికి వస్తున్నాం' కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియోన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పన్స్ లభిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. వెంకటేష్‌కు జతగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.ఇదిలా ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. బుక్ మై షో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్‌లో ఈ మూవీ ట్రెండింగ్‌లో ఉంది.

ఇంకా 2 రోజులు మిగిలి ఉండగానే, హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1.6 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. యూఎస్ఏతో సహా అనేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. నైజాంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇంక ఆంధ్రాలో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇది ఖచ్చితంగా వెంకటేష్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతికి హిట్ సినిమాగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. భార్య, మాజీ ప్రియురాల మధ్య సాగే కథాంశంతో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని తెరకెక్కించారు. అనిల్ రావిపూడి శైలి ఎంటర్టైన్మెంట్ కి క్రైమ్ ఎలిమెంట్ ని మిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 14(మంగళవారం)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications