Scene Movie Review: సరికొత్త అవతారంలో సూర్య.. ‘సీన్’ మూవీ రివ్యూ!
Scene Movie Review: స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ప్రముఖ చిత్రం సీన్'. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ జిత్తు మాధవన్ ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరోవైపు ఈ సినిమాను పక్కా తెలుగు కమర్షింయల్ చిత్రంలాగా డిజైన్ చేశాడు. ఇందులో నజ్రియా ఫహాద్ కథానాయికగా నటించగా.. నస్లేన్ విలన్ పాత్రలో కనిపించారు. సూర్య కాంబినేషన్లో ఈ ఏడాది వచ్చిన మూడో థియేట్రికల్ రిలీజ్ కావడం, పలువురు ప్రముఖ నటీనటులు జతకట్టడంతో ఈ క్రైమ్ కామెడీ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
స్టోరీ
డీఎస్పీ ప్రేమ్‌రాజ్(సూర్య) తన ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటాడు. కానీ నేరాలను త్వరగా ఛేదించే అతని సామర్థ్యం వల్ల పై అధికారులు రాజీనామాను అంగీకరించరు. అదే సమయంలో పర్ఫ్యూమ్ కిల్లర్(టోవినో థామస్) శైలిని పోలి ఉన్న ఓ హత్య కేసును పరిష్కరించే బాధ్యతను ప్రేమ్‌రాజ్‌కు అప్పగిస్తారు. తన అసిస్టెంట్ మాయ(నజ్రియా) సాయంతో ప్రేమ్‌రాజ్ ఈ కేసును ఎలా ఛేదించాడు, అతని జీవితంలో దాగి ఉన్న రహస్యం ఎలాంటి మలుపులు తిప్పింది అనేదే ఈ చిత్ర కథాంశం. సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. డైరెక్టర్ దీనికి హాస్యాన్ని జోడించి వినోదాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.

ప్లస్ పాయింట్లు
సూర్య ఈ క్యారెక్టర్లో ఢిఫరెంట్ స్టైల్లో సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో కూడా ఆయన చేసే కామెడీ బాగా కుదిరింది. సూర్య-నజ్రియా జోడీ మధ్య వచ్చే డైలాగ్స్, ముఖ్యందా మార్చురీ సీన్ నవ్వులు పూయిస్తుంది. విలన్‌గా నస్లేన్ నటన, క్యాజువల్ ప్రవర్తన ఆకట్టుకుంటాయి. సుశిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
మైనస్ పాయింట్లు
స్టోరీ పరంగా ప్రధానమైన ప్లాట్ సాధారణంగా అనిపిస్తుంది. విలన్ పాత్రకు బలమైన నేపథ్యం లేకపోవడం వల్ల ఘర్షణ తీవ్రత తగ్గిపోయింది. మొదటి భాగం కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది. హీరో, విలన్ మధ్య ఎదురెదురు సీన్లు చివర్లోనే ఎక్కువగా రావడం డ్రామాను కాస్త తగ్గించింది. టోవినో థామస్ పాత్రకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా..
మొత్తానికి 'సీన్' సినిమా సాంప్రదాయ క్రైమ్ థ్రిల్లర్లలా కాకుండా విచిత్రమైన పాత్రలు, హాస్యంతో సాగే ఓ భిన్నమైన సినిమా. సూర్య తన నటనతో సినిమాను ముందుండి నడిపించారు. ఫస్టాఫ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో వచ్చే సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. క్రైమ్-కామెడీ స్టైల్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.
*రేటింగ్: 3/5.














Click it and Unblock the Notifications
