సీతగా సాయి పల్లవి.. శూర్పణఖగా రకుల్.. ప్రేక్షకుల మనసు గెలిచింది ఎవరు?

Ramayana Movie: నితేష్ తివారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయణ పార్ట్ 1' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. నటీనటుల పనితీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా.. ఈ సినిమాలో హీరోయిన్ల నటన విషయంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ టాక్, పబ్లిక్ రివ్యూల ప్రకారం.. శూర్పణఖ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ప్రశంసలు అందుకుంటూ లైమ్‌లైట్‌ను సొంతం చేసుకుంది.

Ramayana Review: రణబీర్ రాముడిగా ప్రశాంతం.. రావణుడిగా యష్ విధ్వంసం! 'రామాయణ ’ ఎలా ఉందంటే?
Ramayana Review: రణబీర్ రాముడిగా ప్రశాంతం.. రావణుడిగా యష్ విధ్వంసం! 'రామాయణ ’ ఎలా ఉందంటే?

ఈ సినిమాలో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనబరిచిన నటన, హావభావాలకు ప్రేక్షకులు దాసోహమవుతున్నారు. తెరపై ఆమె చూపించిన అందం, భావోద్వేగాలు ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆకట్టుకున్నాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. "సినిమాలో రకుల్ తన నటనతో ఓ ప్రత్యేకమైన గ్రాండ్ లుక్, పవర్ తీసుకొచ్చింది. ఆమెను స్క్రీన్‌పై విస్మరించడం అసాధ్యం" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అత్యంత తక్కువ స్క్రీన్ టైంలోనే తన నటనతో అభినందనలు అందుకోవడమే కాకుండా ఇప్పటివరకు తెరపై కనిపించిన అత్యంత అందమైన రాక్షస పాత్రగా రకుల్ శూర్పణఖ పాత్రకు ప్రాణం పోసిందని ప్రశంసిస్తున్నారు.

Ramayana Part 1 Movie Rakul Preet Singh Shines as Surpanakha Sai Pallavi Gets Mixed Reviews Details

మరోవైపు సీతాదేవి పాత్ర పోషించిన సాయి పల్లవి నటనపై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ లభిస్తోంది. సీతగా సాయి పల్లవి యాక్టింగ్ బాగున్నప్పటికీ.. ఆమె తన పూర్తి స్థాయి ప్రతిభను కనబరచలేకపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాముడిగా నటించిన రణబీర్ కపూర్, సీతగా నటించిన సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ అనుకున్నంత స్థాయిలో పండలేదని, వారిద్దరి జోడీ ఆకట్టుకునేలా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కాస్టింగ్, కొన్ని సీన్ల చిత్రీకరణపై కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Ramayana Twitter Review: 'రామాయణ' మూవీ ట్విట్టర్ రివ్యూ ఇదే..
Ramayana Twitter Review: 'రామాయణ' మూవీ ట్విట్టర్ రివ్యూ ఇదే..

అయితే సీతాదేవి పాత్రలో సాయి పల్లవి చూపించిన నిరాడంబరత, సహజ సిద్ధమైన నటనను కొందరు సినీ ప్రియులు ఎంతగానో ప్రశంసించారు. రణబీర్ కపూర్‌తో కెమిస్ట్రీ పరంగా కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. పాత్రకు అవసరమైన సరళతను, భావోద్వేగాలను పండించడంలో ఆమె విజయం సాధించిందని పేర్కొంటున్నారు. మొత్తానికి 'రామాయణ' సినిమాలో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ తన నటనతో మెప్పించగా.. సీతగా సాయిపల్లవి పాత్ర చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+