ప్రముఖ నటుడు ఆత్మహత్య..ఆ నటితో ఎఫైరే కారణామా..?
తెలుగు ఇండస్ట్రీ వరుస విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవల సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. త్రినయని సీరియల్ నటుడు చందు(చంద్రకాంత్) ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేకనే నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్‌తో చందుకు ఆరేళ్లుగా దగ్గర అనుబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చందు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చందు ప్రస్తుతం భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ పవిత్ర జయరామ్‌తో సహజీవనం చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా వీరిద్దరు కలిసి జీవినం సాగిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో చందు కూడా అదే కారులో ఉన్నారు. ఆయనకు స్వల్ప గాయాలైయ్యాయి.

పవిత్ర జయరాం యాక్సిడెంట్‌లో మరణించగా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు ఆత్మహత్యకి పాల్పడ్డారని తెలుస్తుంది. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారట. దీంతో ఆ డిప్రెషన్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు టాక్. హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కాగా, చందు తెలుగులో త్రినయని, కార్తీక్ దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. అయితే చందు ఆత్మహత్యకి అదే కారణమా? మరేదైనా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications