మళ్లీ పెళ్లి చేసుకున్న కార్తీక దీపం సీరియల్ హీరో
వెండితెరకు ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర నటులు నటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వెండితెర నటులకు ధీటుగా బుల్లితెర నటులు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సీరియల్స్ నటులు తమ నటనతో ఫ్యామిలీ ఆడియోన్స్‌ను కట్టిపడేస్తున్నారు. ఇక బుల్లితెరపై 'కార్తీక దీపం'సీరియల్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. బుల్లితెరపై కొన్నేళ్లు 'కార్తీక దీపం'సీరియల్ హవా కనిపించింది. ప్రతి ఇంటిలోనూ 'కార్తీక దీపం'సీరియల్ చూస్తూ కనిపించేవారు. ఈ సీరియల్ గురించి ఆడియోన్స్‌లో విపరీతమైన చర్చ నడిచింది.
ఈ సీరియల్ ద్వారా ఆర్టిస్టులకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఈ సీరియల్‌లో హీరోగా నటించిన నిరూపమ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అందులో డాక్టర్ బాబు పాత్రలో అద్భుతంగా నటించి తనకంటూ మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. నిరూపమ్‌కు బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉంది. 'చంద్రముఖి' , 'కార్తీక దీపం','కార్తీక దీపం 2' 'మూగ మనసులు', 'హిట్లర్ గారి పెళ్లాం' వంటి సీరియల్స్‌తో బుల్లితెర హీరోగా ఎదిగాడు.

చంద్రముఖి సీరియల్ యాక్టర్ మంజులనే నిరూపమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చంద్రముఖి సీరియల్ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఈ జంట వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. నిరూపమ్ భార్య మంజుల సైతం పలు సీరియల్స్‌లో నటిస్తోంది. ఇదిలా ఉంటే నిరూపమ్ మళ్లీ చేసుకున్నాడు. నిరూపమ్ మళ్లీ చేసుకుంది ఎవర్నో కాదు.. ఆమె భార్య మంజులనే నిరూపమ్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు.
ఆదివారం (అక్టోబర్ 13) నిరూపమ్, మంజుల పెళ్లి రోజు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే తేదీన ఈ కపుల్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిరూపమ్, మంజుల మరోసారి పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిరూపమ్ మరోసారి మంజుల మెడలో మూడుముళ్లు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నిరూపమ్ దంపతులు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications