షారుక్ ఖాన్ నెక్స్ట్ టార్గెట్ అదే.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాజకుమార్ హిరాణీ సినిమా!!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రాజ్ కుమార్ హిరాణీ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే పఠాన్, జవాన్ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ లను అందుకున్న బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ రొటీన్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అయిన డంకీ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నారు.
సామాజిక అంశాలు ఇతివృత్తం చేసుకుని మనసుకు హత్తుకునేలా తీసే ప్రముఖ టాప్ డైరెక్టర్ రాజకుమార్ హిరాణీ షారుక్ ఖాన్ హీరోగా నిర్మిస్తున్న డంకీ చిత్రం పైన కూడా షారుక్ అభిమానులకు బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే రాజ్ కుమార్ హిరాణీ గతంలో తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీసు బద్దలుకొట్టిన సినిమాలే.

మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, పీకే, సంజు, 3 ఇడియట్స్ ఇలా ప్రతి చిత్రం దేనికదే సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇటువంటి టాప్ డైరెక్టర్ తో వరుస సక్సెస్ లను సాధిస్తున్న హీరో షారుక్ ఖాన్ డంకీ చిత్రం పై అందరి దృష్టి నెలకొంది.
సినిమాలలో ఐదు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంతో మళ్ళీ తెర మీదకు వచ్చి ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పునర్ వైభవాన్ని తీసుకువచ్చాడు. ఇక ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీ వరుస పాన్ ఇండియా సినిమాలను అందిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
పఠాన్ సినిమా తర్వాత కేవలం 7 నెలల గ్యాప్ లోనే జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ మరో భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చేతిలో ఉన్న సినిమా డంకీ. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ ను అందుకుంటే షారుక్ ఖాన్ కు తిరిగే ఉండదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
ప్రఖ్యాత దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిర్మిస్తున్న డంకి చిత్రం ఏ మేరకు సక్సెస్ అవుతుందో? షారుక్ ఖాన్ కు ఎటువంటి ఇమేజ్ ను తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే. పఠాన్ , జవాన్ లను మించిన హిట్ టాక్ ఈ సినిమా సాధిస్తుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications