15 నిముషాల పాటు తిరుమల దర్శనం.. హీరోయిన్ క్లారిటీ..
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు.. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం కోట్లాదిమంది భక్తులు తరలివస్తుంటారు. రెండు సెకన్ల దర్శనభాగ్యం కోసం ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి దేవ దేవుని దర్శనం చేసుకుంటారు. అయితే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శివాని నాగారం ఇటీవల తిరుమల దర్శనంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఆమె తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది.
హీరోయిన్ శివానీ నాగారం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను తిరుమలలో శ్రీవారిని దాదాపు 15 నిమిషాల పాటు దర్శనం చేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ అనుభవాన్ని పంచుకుంది. చిన్నప్పుడు తిరుపతికి వెళ్లానని.. మళ్లీ 13 ఏళ్ల తర్వాత తిరుమలకు వెళ్లాలని తెలిపింది. శ్రీవాణి దర్శనం టికెట్ ద్వారా లైన్ నుంచి గర్భగుడి వరకు స్వామివారిని దగ్గర్నుంచి చూసే అవకాశం దక్కిందని పేర్కొంది. అయితే ఆమె వ్యాఖ్యలు తప్పుగా అర్థమై.. హీరోయిన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఎందుకు..? అంటూ విమర్శలు వచ్చాయి.

ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు శివానీ నాగారం ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం.. నా పేరు శివాని నాగారం YouTube లో ఓ ప్రైవేట్ ఛానల్ లో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నేను నా స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నాను. అందులో తిరుపతి గురించి నేను మాట్లాడడం జరిగింది. అయితే 15 మినిట్స్ దర్శనం అది కొంచెం హైలెట్ అవుతుంది.
దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. 2025 అక్టోబర్ లో రూ. 10,500 రూపాయలు కట్టి శ్రీవాణి దర్శనం టికెట్స్ నేను మా అమ్మతో లైనులో నిల్చొని తీసుకున్నాం. ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకున్నాం. తిరుమల ఆలయంలో క్యూ లైన్ లో మొదటి నుంచి స్వామి దగ్గరకు వెళ్లేంత వరకు కొంచెం కొంచెం స్వామి వారు కనిపిస్తుంటారు. నేను ఆ సమయం అందాజా వేసి ఆ మొత్తం 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పాను. అంతే కానీ 15 నిముషాలు నన్ను ఎవరూ టచ్ చేయలేదు అని కాదు' అని శివానీ స్పష్టం చేశారు. ప్రస్తుతం అది కొంచెం మిస్ లీడ్ అవుతూందన్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications