త్రిషపై సింగర్ సుచిత్ర మరో బాంబు!
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రముఖ సింగర్ సుచిత్ర మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా నటి త్రిషను లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వేడుకకు ఆయన భార్య సంగీత, పిల్లలు దూరంగా ఉండటం.. అదే సమయంలో త్రిష అక్కడ ప్రత్యక్షమై విజయ్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడంపై సుచిత్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విజయ్ తన భార్యకు అధికారికంగా విడాకులు ఇవ్వకుండానే త్రిషతో బహిరంగంగా తిరుగుతున్నారని సుచిత్ర ఆరోపించారు. "విజయ్ భార్య సంగీత ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. ఆయనకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఇలాంటి పనులు చేస్తూ విజయ్ తన ఫాలోవర్లకు తప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నారు. కనీసం తన భార్య, పిల్లల మానసిక స్థితి గురించి విజయ్ ఆలోచించాలి" అని సింగర్ సుచిత్ర తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.

త్రిషను ఓ పరాన్నజీవితో పోలుస్తూ సింగర్ సుచిత్ర గతంలోనూ విమర్శలు చేశారు. విజయ్ తన తల్లిదండ్రులు, భార్యకు దూరమై ఒంటరిగా ఉన్న సమయంలో త్రిష ఆయన జీవితంలోకి ప్రవేశించిందని ఆమె వ్యాఖ్యానించారు. విజయ్ మహిళా అభిమానులు కూడా ఆయన భార్యకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోకుండా ఓ అక్రమ సంబంధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని సింగర్ సుచిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళపతి విజయ్ భార్య సంగీత ఏప్రిల్ 2026లో చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విజయ్ తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని.. ఓ నటితో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ నటితో విజయ్ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని, దీనివల్ల తాను సమాజంలో తలదించుకోవాల్సి వస్తోందని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు. వీరిద్దరికీ 1999లో వివాహం జరగగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. సరిగ్గా త్రిష పుట్టినరోజు నాడే ఈ ఎన్నికల ఫలితాలు రావడం, ఆ వెంటనే ఆమె విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలపడం వంటి పరిణామాలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరు కావడంతో వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనే ప్రచారం బలపడింది.












Click it and Unblock the Notifications