ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. ఇప్పుడే చూసేయండి..
జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా ఓటీటీలోకి ఓ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఈ మూవీ ఐఎండీబీలో 8.4 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ మూవీ తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామాను కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది.
తమిళ హీరో విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సిరాయ్' అంటే తెలుగులో జైలు అని అర్థం వస్తుంది. ఈ మూవీ జనవరి 26 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 25 న విడదలైన ఈ మూవీ థియేటర్ల వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ కోర్టు రూమ్ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను థ్రిల్లింగ్ కు గురిచేసింది. అలా 2025 లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రావడంతో తెలుగు ఆడియన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఇక సిరాయ్ మూవీ విషయానికి వస్తే.. ఇది ఓ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఈ మూవీకి సురేష్ రాజకుమారి దర్శకత్వం వహించారు. అతనికి ఇదే తొలి మూవీ కావడం విశేషం. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ సురేష్. ఇక ఈ మూవీలో విక్రమ్ ప్రభుతోపాటు ఎల్కే అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్ కుమార్ లాంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు.

సిరాయ్ మూవీని కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు నిర్మాతలు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది. అన్ని వర్గాల నుంచి సినిమాకు పాజిటివ్ రివ్యూలు దక్కాయి. అలాగే ఈ మూవీకి ఐఎండీబీ లోనూ 8.4 రేటింగ్ ను సొంతం చేసుకుంది. జనవరి 26 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది.












Click it and Unblock the Notifications