ఆ అలవాటు మార్చుకున్నాకే... లైఫ్ బాగుందంటున్న శివకార్తికేయన్

సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నారు స్టార్ హీరో శివ కార్తికేయన్. తనదైన శైలిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి తక్కువ సమయంలో స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. గతంలో కోలీవుడ్ కే పరిమితమైన ఈ న్యాచురల్ స్టార్....ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. రీసెంట్ గానే అమరన్ మూవీతో తెలుగువాళ్లకి కూడా దగ్గరైపోయారు. మేజర్‌ ముకుంద్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవితో జంటగా నటించారు. తన నటనతో ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తెప్పించారు. అంత గొప్పగా, న్యాచురల్ గా నటించి.. అందరి హృదయాలను దోచుకున్నారు. ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజై.. మంచి వసూళ్లు రాబట్టింది.

అయితే ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ఆయన సోషల్ మీడియా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు రెండేళ్లుగా సంవత్సరాలుగా సోషల్ మీడియా వాడటం మానేశారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా లో వస్తున్న ట్రోల్స్, అనవసరమైన విషయాలు పట్టించుకుని బాధపడటం తనకు ఇష్టం లేదంటున్నారు. సోషల్ మీడియా వాడటం మానేసినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నానని అంటున్నారు. అలా తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు.

Sivakarthikeyan hot comments on social media using goes viral

ఇక శివ కార్తికేయన్ హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు.. తమిళంలో బుల్లితెరపై అనేక కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన హోస్ట్ చేసిన దిస్, జోడి వంటి షోలన్నీ తమిళ అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందాయి. శివకార్తికేయన్ మొదట చిన్న తెర నుండి పెద్ద తెరకు హాస్యనటుడిగా అరంగేట్రం చేశాడు. 2012లో పాణిరాజ్ దర్శకత్వం వహించిన మెరీనా చిత్రంతో శివ కార్తికేయన్ వెండితెరపై అడుగుపెట్టాడు.

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించి.. ధనుష్, శ్రుతి హాసన్ జంటగా నటించిన 3వ చిత్రంలో ధనుష్ స్నేహితుడిగా నటించారు. ఆ తర్వాత శివకార్తికేయన్ నటించిన డాక్టర్, మావీరన్, అమరన్ చిత్రాలు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి. కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా తన సత్తా చాటుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+