నయనతార ఖాతాలోకి రూ.50 కోట్లు?
దక్షిణ భారతదేశంలో అత్యంత ఖరీదైన హీరోయిన్లలో ఒకరు నయనతార. సినిమాకు రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. జవాన్ చిత్రంతో బాలీవుడ్ లో కూడా సంచలన విజయం అందుకోవడమే కాదు.. తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారు. అన్ని పరిశ్రమల్లో అందరు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ అవడమే కాదు.. లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకుంటున్నారు.
ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్ నుంచి విడాకులు తీసుకోబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ఇనస్టా గ్రామ్ లో విఘ్నేశ్ ను సాంకేతిక లోపంతో నయనతార అన్ ఫాలో చేసింది. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నయనతార-విఘ్నేశ్ దంపతులు అటువంటిదేమీ లేదని చెప్పి వీటికి స్వస్తి పలికారు. అయితే సోషల్ మీడియాలో మరోవార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

నయనతార విడాకులు తీసుకోబోతుండటంతో ఆమెకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఏకంగా నాలుగు బంపర్ ఆఫర్లు ఆమె తలుపు తట్టాయి. వీటిల్లో రెండు భారీ వాణిజ్య ప్రకటనలు కూడా ఉన్నాయి. వీటినుంచి అడ్వాన్స్ గా ఆమె అకౌంట్ లో ఏకంగా రూ.50 కోట్లు వచ్చాయి. అదృష్టం అంటే నయనతారదే అని సినీ జనాలు అంటున్నారు. ఒక చిన్న ఫేక్ న్యూస్ నయనతార-విఘ్నేశ్ దంపతులకు కోట్ల రూపాయలు కురిపిస్తోందంటున్నారు.
జవాన్ చిత్రం భారీ విజయం సాధించడంతో బాలీవుడ్ నుంచి కూడా నయన్ కు ఆఫర్లు వస్తున్నాయి. పారితోషికం కూడా రూ.15 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నప్పటికీ నిర్మాత, దర్శకులు ఓకే చెబుతున్నారు. బాలీవుడ్ లో తన తర్వాత చిత్రం ఏది అనేది ఇంకా ఖరారు చేయలేదు.












Click it and Unblock the Notifications