పెళ్లై 2 నెలలు కాకుండానే 'గుడ్‌న్యూస్' చెప్పిన శోభిత ధూళిపాళ!

బాలీవుడ్ నటిగా ఉంటూ హాలీవుడ్ సినిమాలు కూడా చేసే అవకాశాన్ని సంపాదించుకున్న తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. డిసెంబరు నాలుగోతేదీన అన్నపూర్ణ స్టూడియోలో చాలా తక్కువమంది అతిథుల మధ్య నిరాడంబరంగా పెళ్లి జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉంటున్న వీరిద్దరూ ముంబయిలో కాపురం పెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శోభితకు బాలీవుడ్ ఆఫర్లు ఎక్కువగా వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆమె ఓ శుభవార్తను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది

నమ్మలేకుండా ఉన్నానంటున్న శోభిత
శోభిత నటించిన 'ది మంకీ మ్యాన్' అనే చిత్రం అంతర్జాతీయ అవార్డుల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ప్రతిష్టాత్మక బాఫ్తా లో బెస్ట్ యాక్షన్ & అడ్వెంచర్ మూవీస్ క్యాటగిరీలో కూడా ఈ సినిమాకు స్థానం దక్కింది. అంతర్జాతీయ అవార్డుల్లో నామినేషన్స్ దక్కించుకోవడం ఒకరకంగా సంచలనమే అని చెప్పాలి. దీనిపై శోభిత స్పందిస్తూ ఇది కలా? నిజమా? అనేది అర్థం కాకుండా ఉందని, నమ్మలేకుండా ఉన్నానని వ్యాఖ్యానించింది. అందుకు అభిమాలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత శోభితకు బాగా కలిసివస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

sobhita dhulipala movie the monkey man has received nominations for international awards

బాలీవుడ్ కే అధిక ప్రాధాన్యత
శోభిత స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. అక్కడే చదువుకున్న శోభిత తర్వాత విశాఖపట్నంలో స్థిరపడింది. మోడలింగ్ మీద, సినిమాల మీద మక్కువతో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ముంబయిలో నివాసం ఏర్పరుచుకుంది. తెలుగులో మొదటిసారిగా అడవి శేష్ సినిమా గూఢచారిలో నటించింది. తెలుగులో అవకాశాలు వచ్చినప్పటికీ హిందీకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. వివాహమైన తర్వాత సినిమాలను మానేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

sobhita dhulipala movie the monkey man has received nominations for international awards

అయితే అక్కినేని కుటుంబ సభ్యులు అంగీకరిస్తే నటించడానికే అవకాశం ఉంటుంది. అయితే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకొని సినిమాలు చేయాలనుకుంటోంది. అయితే అభిమానులకు మాత్రం ఒక విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నాగచైతన్యకు, శోభితకు ఎక్కడ పరిచయం అయింది? వీరి ప్రేమ ఎలా మొగ్గ తొడిగింది? అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియకుండా అలాగే మిగిలిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+