అక్కినేని ఫ్యామిలీకి షాకిచ్చిన శోభిత ధూళిపాళ
తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత.ఇదిలా ఉంటే శోభిత ధూళిపాళ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.

ఆ పోస్ట్‌లో ఏఎన్నార్ గురించి ప్రధాని మోదీ మాట్లాడిన ఫొటోలను షేర్ చేస్తూ.. 'గౌరవనీయులైన మోదీ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కళా నైపుణ్యం మరియు తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కొరకు వారి కృషికి అభినందనలు మీ వంటి గొప్ప నాయకుడి నుండి పొందడం మా అదృష్టం. హృదయ పూర్వక ధన్యవాదములు' అంటూ నమస్కారం చేస్తున్న ఓ ఎమోజీని తన పోస్ట్‌కు జత చేసింది.
ఏఎన్నార్ గురించి మోదీ మాట్లాడటంపై పోస్ట్ చేసి అక్కినేని అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. శోభిత ధూళిపాళ చేసిన పోస్ట్‌ను చూసిన నాగ చైతన్య లైక్ కొట్టడమే కాకుండా రీపోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఇప్పటి నుంచే అక్కినేని కోడలుగా మంచి పేరు తెచ్చుకోవడానికి బాగానే ట్రై చేస్తోందంటూ శోభిత ధూళిపాళ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications