Spider-Man: Brand New Day review: క్లైమాక్స్ ట్విస్ట్ తో పిచ్చి పీక్స్..!
స్పైడర్ మ్యాన్.. సూపర్ హీరోల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ గా ఉన్న సినిమా. స్పైడర్ మ్యాన్ సినిమాకు ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎగబడి చూస్తుంటారు. ఇక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రాంచైజీలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూసిన చిత్రం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. రిలీజ్ కు ముందు నుంచే విపరీతమైన క్రేజ్ ను ఏర్పరచుకుంది. 2021 లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాకు కొనసాగింపుగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రపంచవ్యాప్తంగా జూలై 30 గురువారం రోజున విడుదలైంది.
దాదాపు ఐదేళ్ల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ మూవీ ప్రేక్షకుల్ని అలరించిందా..? టాక్ ఎలా ఉంది..? స్పైడర్ మ్యాన్ మూవీ రేంజ్ లో సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా..? అనే విషయాలు ఇక్కడ చూద్దాం.. ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్ అయిన టామ్ హాలాండ్, జెండాయా, జాకబ్ బాటాలాన్, సాదీ సింక్, జాన్ బెర్నథాల్ పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీని మార్వెల్ స్టూడియోస్, సోనీ పిక్చర్స్, పాస్కల్ పిక్చర్స్ బ్యానర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాయి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే..
స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ చిత్రానికి కొనసాగింపుగానే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. గత పరిణామాల వల్ల పీటర్ పార్కర్ తప్ప ప్రపంచం అంతా స్పైడర్ మ్యాన్ గురించి పూర్తిగా మరిచిపోతుంది. వారిలో అతని గర్ల్ ఫ్రెండ్, స్నేహితుడు కూడా ఉంటారు. అలా పీటర్ పార్కర్ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు. అలాగే న్యూయార్క్ లో జరిగే నేరాలను అరికడుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో న్యూయార్క్ నగరానికి ఊహించని ముప్పు వస్తుంది. జీన్ అనే యువతి ప్రవేశంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. జీన్ ఓ అదృశ్య శక్తి.. క్షణాల్లో ఎదుటి వారి మైండ్స్ ను, మనుషులను తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది.
అలా సూపర్ పవర్ కలిగిన వ్యక్తులను పర్యవేక్షించే డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (DODC) అనే సంస్థపై మెరుపు దాడి చేస్తుంది. అలాగే ఆ అదృశ్య శక్తి కారణంగా తన ప్రియురాలు ఎంజే కూడా ప్రమాదంలో పడుతుంది. దాంతో స్పైడర్ మ్యాన్ మరోసారి తన శక్తి, తెలివితేటలను ఉపయోగించి నగరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఇక అసలు అంత పవర్ ఫుల్ అయిన అ ఆదృశ్య శక్తి ఎవరు..? ఆ శక్తి ఎందుకు నగరాన్ని స్థంభింప చేసింది..? ఆ శక్తి నుంచి స్పైడర్ మ్యాన్ నగరాన్ని, ప్రజలను ఎలా కాపాడాడు..? హల్క్ తో స్పైడర్ మ్యాన్ గొడవేంటి..? ఇలాంటి ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది.

ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ గా టామ్ హాలండ్ నటన,
భావోద్వేగాలతో కూడిన కథ, కథనం, అదృశ్య శక్తి జీన్ పాత్ర, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ యాక్షన్ కాగా.. గత చిత్రాలతో పోలిస్తే యాక్షన్ డోస్ తక్కువగా ఉండటం మైనస్ పాయింట్ గా ఉంది.














Click it and Unblock the Notifications