Sridevi biopic: నేను బ్రతికుండగా ఎవ్వరినీ తియ్యనివ్వను.. షాకిచ్చిన బోనీకపూర్!!

సినిమా ఏదైనా, క్యారెక్టర్ ఏదైనా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించే అందాల తార శ్రీదేవి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా శ్రీదేవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. భారతీయ చిత్ర పరిశ్రమలో వెలుగు వెలిగిన అగ్ర కథానాయికగా శ్రీదేవి తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

శ్రీదేవి బయోపిక్ .. బోనీ కపూర్ సంచలనం
ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్ లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో బసచేసిన శ్రీదేవి తన అభిమానులందరినీ వీడి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక శ్రీదేవి అభిమానుల కోసం శ్రీదేవి బయోపిక్ తీయబోతున్నారు అన్న వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తున్న సమయంలో బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sridevi biopic Boney Kapoor shocking comments I won t let anyone to do sridevi biopic

సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా బోనీ కపూర్ వ్యాఖ్యలు
తాను బ్రతికున్నంత వరకు శ్రీదేవి బయోపిక్ తీయడానికి అనుమతించను అంటూ బోనీ కపూర్ పేర్కొన్నారు. తాను నిర్మాతగా అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న మైదాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించిన నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బోని కపూర్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.

బయోపిక్ పై బోనీ కపూర్ అనుమానం
గత కొన్ని రోజులుగా శ్రీదేవి బయోపిక్ రానున్నట్టు వార్తలు వెల్లువగా మారాయి. ఈ క్రమంలో బోనీ కపూర్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు బోనీ కపూర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అంటే.. బయోపిక్ అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉందని, అందుకే బయోపిక్ తీయడానికి అంగీకరించబోమని బోనీ కపూర్ పేర్కొన్నారు.

నేను బ్రతికుండగా శ్రీదేవి బయోపిక్ ఎవరూ తీయలేరు
తన భార్య శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యత ఇచ్చే మనిషి అని , ఆమె వ్యక్తిగత విషయాలు బయటకు తెలియాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమని బోని కపూర్ పేర్కొన్నారు. ఆమె ఆలోచనలను, ఆమె వ్యక్తిత్వాన్ని తాను గౌరవిస్తానని, అందుకే ఆమె బయోపిక్ తీయడాన్ని అంగీకరించనన్నారు. తాను బతికుండగా ఆమె బయోపిక్ రాదని, ఎవరూ తీయలేరని బోనీకపూర్ చెప్పారు.

శ్రీదేవి బయోగ్రఫీ రాసేందుకు ఆయనకు అనుమతి
అయితే ది లైఫ్ ఆఫ్ ది లెజెండ్ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీ ని ప్రముఖ పరిశోధకుడు రచయిత ధీరజ్ రచించినున్నారని, దీనికోసం తమ పర్మిషన్ కూడా తీసుకున్నారని ఆయన తెలిపారు. బాలనటిగా సినీ జీవితాన్ని మొదలుపెట్టిన శ్రీదేవి నటన ప్రస్తానాన్ని ఆమె జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలని, ఆమె నటనకు అందుకున్న అవార్డులను రివార్డులను ధీరజ్ తాను రచించే శ్రీదేవి బయోగ్రఫీలో రాయనున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+