సమంతకు ఫామ్‌హౌస్ గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్
దక్షిణాదిలోనే కాకుండా భారతదేశవ్యాప్తంగా నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తోంది సమంత. బాలీవుడ్ లో సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్ లు చేయడంద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా ఐమ్యాక్స్ వరుసగా విడుదల చేస్తోన్న జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని సమంత కైవసం చేసుకుంటూ వస్తోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురవడంతో చికిత్స తీసుకునేందుకు రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. తర్వాత నాన్న మరణించడంతో మరో దెబ్బ తగిలింది. ఈ షాక్ లన్నింటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
హీరోయిన్ గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ల సరసన నటిస్తున్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన అతని తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించే అల్లుడు శ్రీను సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. కొత్త హీరో కాబట్టి సమంత వెనకాడుతుందేమోనని ఆమెకు భారీ పారితోషికాన్ని సురేష్ ఇచ్చారు. వి.వి.వినాయక్ దర్శకుడు. భారీ తారగణంతో నిర్మించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే నిర్మాత సురేష్ కు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

ఆ సమయంలో చికిత్స తీసుకునేందుకు డబ్బులు అవసరంకాగా బెల్లంకొండ సురేష్ రూ.25 లక్షలు ఇచ్చారు. తర్వాత పారితోషికంలో దీన్ని సమంత సర్దుబాటు చేసింది. సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత ఆనందంలో ఉన్న సురేష్ బాబు అగ్ర హీరోయిన్ అయినప్పటికీ తన కొడుకు పక్కన హీరోయిన్ గా నటించినందుకు సంతోషించి ఓ ఫామ్ హౌస్ ను బహుమతిగా ఇచ్చాడు. ఇటీవలే ఓ తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన పలు సినిమాలను తెరకెక్కించారు.












Click it and Unblock the Notifications