రష్మీ ఫోన్ చేసి అడగ్గానే డబ్బులు పంపించిన సుడిగాలి సుధీర్
బుల్లితెరపై రాణిస్తున్న స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న కార్యక్రమాలకు హోస్ట్ గా చేస్తున్నప్పటికీ ఈటీవీలో ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారానే ఆమె స్టార్ యాంకర్ గా మారారని చెప్పొచ్చు. ఎన్ని కార్యక్రమాలు చేసినా, చేస్తున్నా రాని పేరు ఈ కార్యక్రమంద్వారా రష్మీకి వచ్చింది. సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఉండే లవ్ ట్రాక్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పొచ్చు. అంతేకాదు.. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అందరినీ ఆకట్టుకుంది. వీరి జంటకు బుల్లితెర ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.
సుధీర్ ను అడగాలంటూ సలహా ఇచ్చిన ఆది
వీరిద్దరూ కలిసి షోలు చేయాలని అంతా కోరుతున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దీనిలో భాగంగా అందరి ఫోన్లను ఒకచోట పెట్టి అందులో నుంచి కొన్ని ఫోన్లు తీసి, ఆ ఫోన్ కు సంబంధించివారు ఎవరికైనా సరే అర్జెంటుగా రూ.10వేలు పంపించాలనేది టాస్క్. మొదటగా బుల్లెట్ భాస్కర్ తన తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగితే తర్వాత మాట్లాడదామంటూ ఫోన్ కట్ చేస్తారు. తర్వాత రష్మీ వంతు వస్తే ఆమె సుడిగాలి సుధీర్ కు ఫోన్ చేసి రూ.10వేలు అడగాలంటూ హైపర్ ఆది సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారం రష్మీ ఫోన్ చేస్తుంది.

ఫోన్ ఎత్తి రష్మీ బేబ్ అంటాడు
సుధీర్ ఫోన్ ఎత్తగానే రష్మీ బేబ్ అంటూ పకలరిస్తాడు. చాలా స్నేహంగా చెప్పరా ఏమిటి అని అడుగుతాడు. తనకు వెంటనే రూ.10వేలు కావాలని రష్మి కోరగా గూగుల్ పే ఉందా ఈ ఫోన్ కు అని తను ఫోన్ కట్ చేసేలోపు రూ.10వేలు పంపిస్తాడు సుధీర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రష్మి-సుధీర్ ను అభిమానించేవారు దీన్ని తెగ వైరల్ చేస్తూ ట్రెండింగ్ లోకి తెస్తున్నారు. ఈటీవీ, మల్లెమాల వీరిద్దరినీ కలిపి ఓ షో చేయాలని కోరుతున్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటికీ మంచి స్నేహం కొనసాగుతోంది. ఎలాగైనా వీరిద్దరితో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ వారిద్దరి అభిమానులు టెలివిజన్ షోల నిర్వాహకులను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications