మహేష్‌బాబు - రాజమౌళి: 'గరుడ'?

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో పాన్ వరల్డ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు ఇది 29వ సినిమా అవుతుంది. ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు ప్రిన్స్ సిద్ధమవుతున్నారు. పొడవాటి జుట్టు, పెరిగిన గడ్డంతో ఇంతవరకు తాను ఎప్పుడూ తెరపై కనిపించని విధంగా కనిపించబోతున్నారు. ఇటీవలే దీనికోసం జర్మనీ కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది.

పోస్ట్ షేర్ చేసిన విజయన్
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్ డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచూసినప్పటికీ వారి ఆశ నిరాశే అయింది. అయితే ఈ సినిమాకు పనిచేస్తున్న విజువల్ డెవలప్ మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో ఆయన బంగారు రంగులో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని పేర్కొన్నారు. దీంతో ఈ సినిమాకు గరుడ అనే పేరు పెట్టబోతున్నారంటూ వార్తలు వైరలవుతున్నాయి.

super star mahesh babu and director rajamouli combination movie name garuda

కొన్నాళ్ల క్రితం రాజమౌళి చెప్పారు
కొద్ది సంవత్సరాల క్రితమే దర్శకుడు రాజమౌళి గరుడ ప్రాజెక్టు గురించి చెప్పారు. బాహుబలి సినిమా తర్వాత తాను చేయబోయే ప్రాజెక్టు గరుడ అన్నారు. అయితే అందుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడి చేయలేదు. తారక్, రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. తాజాగా విజయన్ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం రాజమౌళి అనుకుంటున్న గరుడ ఇదేనా? కాదా? అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్ పై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.

మూడు సంవత్సరాల సమయం
ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వ శైలిపై మహేష్ బాబు అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మీడియా ముందుకు త్రివిక్రమ్ రాలేదు. రాజమౌళితో చేయబోతున్న సినిమాకు మూడు సంవత్సరాల సమయం పడుతోందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+