నా పెళ్లి కంటే ముందు మా అమ్మ పెళ్లి చేయాలి - సుప్రీత

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సురేఖ వాణి. బొమ్మరిల్లు, రెడీ, నాయక్, దుబాయ్ శీను, బాద్ షా లాంటి సినిమాల్లో సురేఖా వాణి కామెడీ కూడా బాగా పండించింది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించింది. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ.. సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన కూతురు సుప్రీతాతో కలిసి ఆమె చేసే రచ్చ అందరికి తెలిసిందే.

మోడ్రన్ డ్రస్సుల్లో సురేఖవాణి, తన కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి. అందంలో మాత్రం కూతురుకే గట్టి పోటీ ఇస్తుంది సురేఖా వాణి. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ సురేఖా వాణి షేర్ చేస్తున్న ఫొటోలు ట్రెండింగ్ గా మారుతున్నాయి. కాగా సురేఖ వాణి - సుప్రీత తల్లీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. భర్త మరణం తర్వాత తన కూతురే ప్రపంచంగా బతుకుతున్న సురేఖ కోసం, సుప్రీత ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది.

సుప్రీత మనసులోని మాట వింటే ఆమెకు తన తల్లిపై ఉన్న ప్రేమ ఎంతటిదో అర్థమవుతుంది. అయితే తాజాగా తన తల్లి పెళ్లి విషయంలో సుప్రీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేను పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్లేముందే, నా తల్లి జీవితంలో ఒక తోడు ఉండాలని ఆశిస్తున్నాను. ఆమెను అమితంగా ప్రేమించే, గౌరవించే వ్యక్తి ఆమె జీవితంలోకి రావాలి. ఈ విషయంపై ఇప్పటికే నేను మా బంధువులతో కూడా చర్చించాను, వారందరూ కూడా నా నిర్ణయానికి మద్దతుగా నిలిచారు" అని సుప్రీత తెలిపింది. సురేఖా వాణి రెండో పెళ్లి గురించి సుప్రీత ఆలోచిస్తున్నప్పటికీ.. అది కేవలం తన ఇష్టం మాత్రమే కాదని ఆమె స్పష్టం చేసింది.

Surekha vani daughter supreetha interesting comments about her marriage and mother marriage

ఫైనల్ గా అమ్మ సంతోషమే తనకు ముఖ్యమని.. తన నిర్ణయమే తుది నిర్ణయం అన్నారు. నాన్న ఉన్న స్థానాన్ని మరొకరికి ఇవ్వడానికి అమ్మ ఇష్టపడటం లేదని.. ఆమె భావాలను నేను గౌరవిస్తాను. తనకి ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేయను. కానీ జీవితాంతం అమ్మ ఒంటరిగా ఉండకూడదనేదే నా తపన" అని ఓపెన్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+