హైదరాబాద్ ఆంటీలంతా చీరలు కట్టారు... బ్రాహ్మణి కూడా!
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ కంపెనీ జేజే ఆక్టివ్, తనైరా సంస్థ సంయుక్తంగా హైదరాబాదులో మహిళలతో శారీరన్ నిర్వహించాయి. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ పోటీని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జండా ఊపి ప్రారంభించడంతోపాటు తాను కూడా కొంత సమయం పాల్గొన్నారు. దాదాపు 3వేల మందికిపైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
పరుగు పందెం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. పరిగెత్తుతూ ఒకరు మొదటి స్థానంలో నిలవడం. అయితే ఇందుకు భిన్నంగా దీన్ని నిర్వహించారు. మహిళలు చీరకట్టులో పరుగులు పెడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. పోటీల్లో పాల్గొన్న స్త్రీలు సంప్రదాయ చీరకట్టులో పాల్గొన్నారు.

వాస్తానికి ప్యాంట్, షర్ట్ వేసుకొని పరిగెత్తాలంటేనే కాస్త కష్టంగా ఉంటుంది. అయితే మూడువేల మంది మహిళలు చీరలు కట్టుకొని పరుగులు తీయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటి పోటీలు స్త్రీలకు గౌరవాన్ని తెస్తాయని, చీరకట్టు అనేది మహిళలకు హుందాతనాన్ని ఇస్తుందని బ్రాహ్మణి అన్నారు.

హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సంస్థను లాభాలబాటలో పయనింపచేస్తున్నారు బ్రాహ్మణి. మరోవైపు తన భర్త నారా లోకేష్, మామ చంద్రబాబునాయుడు, అత్త భువనేశ్వరికి మద్దతుగా రాజకీయాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇటీవలే లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులతోపాటు మంగళగిరి నియోజకవర్గాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయదలుచుకున్నదీ వివరంగా చెబుతున్నారు.

మహిళా నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా బ్రాహ్మణి యాక్టివ్ గా ఉంటారు. తన మామ చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కొద్దిరోజులు కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications