తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సినిమాల్లో హీరోలు హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యత ఉందో టీవీల్లో యాంకర్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. వారికి రోజురోజుకు క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. తక్కువ కార్యక్రమాలే చేసినా తమదైనశైలిలో యాంకరింగ్ చేసి అభిమానులను సంపాదించుకునేవారే ఎక్కువ. అందుకే యాంకర్లే హీరో హీరోయిన్లుగా సినిమాల్లో నటిస్తుంటారు. బుల్లితెరపై వారు చేసే సందడి అలా ఇలా ఉండదు.
తమ కష్టానికి తగినట్లుగానే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంటారు. ఒక ప్రోగ్రామ్ లేదంటే ఆడియో ఫంక్షన్, లేదంటే సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్... ఇలా ఏ కార్యక్రమమైనా ముక్కుపిండి వసూలు చేసేవారు కూడా ఉన్నారు. తెలుగులో యాంకర్లు ఎవరెవరు, ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసుకుందాం.

* తెలుగులో టాప్ యంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల 2.5 లక్షల పారితోషికం తీసుకుంటుంది.
* యాంకర్ మంజూష ప్రస్తుతం రూ.30వేలు తీసుకుంటోంది. ఎక్కువగా ఇంటర్వ్యూలు చేస్తుంటుంది.
* యంకర్ రవి ప్రస్తుతం లక్షరూపాయలు తీసుకుంటున్నాడు. సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
* యాంకర్ వర్షిణి రూ.30వేలు తీసుకుంటోంది.
* యాంకర్ శ్యామల ప్రస్తుతం రూ.50వేలు తీసుకుంటోంది. సినిమాల్లోనూ నటిస్తోంది.
* యాంకర్ ప్రదీప్ మేల్ యాంకర్స్ లో మొదటి స్థానంలో ఉంటాడు. లక్ష రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు.
* అప్పుడప్పుడూ కనిపించే శిల్పా చక్రవర్తి రూ.25వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటుంది.
* జబర్దస్త్ బ్యూటీ రష్మి రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు తీసుకుంటుంది.
* యాంకర్ అనసూయ రూ. 2 లక్షల పారితోషికం తీసుకుంటుంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది.
* జబర్దస్త్ కొత్త యాంకర్ గా వచ్చిన సీరియల్ నటి సౌమ్య రావు ఒక్కో ఎపిసోడ్ కు రూ.60 వేలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications