తెలుగు ఇండస్ట్రీలో ఎవరి ఆస్తులు ఎక్కువ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరి ఆస్తులు ఎక్కువ? అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, శోభన్ బాబు... ఇలా హీరోలందరిపేర్లు వినిపిస్తాయి. అయితే వాస్తవ మార్కెట్ విలువను కూడా పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే అందరికన్నా ఎక్కువ ఆస్తిపరుడు శోభన్ బాబు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. హీరోగా తాను సంపాదించే ప్రతి రూపాయిని ఆయన భూమిపై పెట్టుబడి పెట్టారు. ఆయన దారిలోనే మురళీమోహన్ కూడా పయనించి కుబేరుడైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న జనాభా మాత్రం ఇబ్బడి ముబ్బడిగి పెరుగుతుందికానీ.. అందుకు అవసరమైన భూమి మాత్రం పెరగదు అని శోభన్ బాబు ఆలోచన. దీన్ని దృష్టిలో ఉంచుకొని పొలాలు, తోటలు, ఇళ్లు కొనేవారు. సినిమాలద్వారా వచ్చిన సంపాదనను ఎంతో జాగ్రత్తగా భూమిపై పెట్టుబడి పెడుతూ వచ్చారు. మొదట్లో హైదరాబాద్ లో ఎన్నో భూములు కొనుగోలు చేశారు. చెన్నైలో మాత్రం వేల ఎకరాలను కొన్నారు. 2008లో శోభన్ బాబు కన్ను మూసేవరకు ఆయన ఆస్తుల విలువ రూ.80వేల కోట్లకు పైమాటే. అది తాజాగా లక్ష కోట్లరూపాయలకు చేరినట్లు సమాచారం.

telugu film actor sobhanbabu property value

కొంద‌రి నుంచి రుణాలు కూడా తీసుకుని త‌ర్వాత శోభన్ బాబు తీర్చేశారు. ద్రాక్ష తోట‌ల నుంచి పొలాల వ‌ర‌కు కూడా శోభ‌న్‌బాబు అన్నీ కొనేవారు. భూమిపైన మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపవుతుందేకానీ ఎన్నడూ నష్టం చేయదని, భవిష్యత్తులో ఇదే పెద్ద ఆస్తిగా మారుతుందని సన్నిహితులకు, తోటి హీరోలకు చెప్పేవారు. హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణం చేపట్టాలని శోభన్ బాబుపై ఎన్టీఆర్, కృష్ణ లాంటివారు ఒత్తిడి చేసేవారంట. అయితే శోభన్ బాబు మాత్రం వాటి జోలిక వెళ్లలేదు. అంతేకాదు.. తన కుమారుడిని కూడా ఇటువైపునకు రానివ్వలేదు. ఎవరూ సంపాదించలేనన్ని ఆస్తులను శోభన్ బాబు పోగేశారంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+