పవన్ కల్యాణ్ వల్ల తీవ్రంగా నష్టపోయా..జాలి కూడా చూపించలేదు - తెలుగు నిర్మాత షాకింగ్ కామెంట్స్

సింగమనల రమేష్ బాబు గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ, 2000ల్లో ఆయన అంటే తెలియని సినీ అభిమాని ఉండేవారు కాదు. ఒకప్పుడు మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌లతో సినిమాలు చేశారాయన.మహేష్ బాబుతో ఖలేజా, పవన్ కల్యాణ్‌తో కొమరం పులి వంటి సినిమాలను సింగమనల రమేష్ బాబు నిర్మించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి.

హిట్స్, ఫ్లాప్స్‌తో ఎటువంటి సంబంధం లేకుండ సినిమాలు తీసేవారాయన. సింగమనల రమేష్ బాబు కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలాకాలం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ రోజుల్లో రాజమౌళి, శంకర్, సుకుమార్ వంటి దర్శకులు రెండేళ్లు, మూడేళ్లు సినిమాలు పడుతున్నాయని, కానీ అప్పట్లోనే రెండు, మూడేళ్లు సినిమాలు తీయడం వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని సింగమనల రమేష్ బాబు చెప్పుకొచ్చారు.

telugu PROducer shocking comments on pawan kalyan and Mahesh Babu

మూడేళ్లకి మెయింటనెన్స్, ప్రొడక్షన్ ఖర్చు, ఆఫీసు ఖర్చు, జీతాలు ఇలా ఎన్ని ఉంటాయనేది ఒక ప్రొడ్యూసర్‌కే తెలుస్తుంది. ఈ రెండు చిత్రాల వల్ల నాకు రూ.100 కోట్ల నష్టం వచ్చింది'' అని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా పవన్ కల్యాణ్ ప్రజరాజ్యం పార్టీలో చేరడంతో కొమరం పులి బాగా ఆలస్యం అయిందని, దాని వల్ల బాగా నష్టం వచ్చిందని, హీరోలెవ్వరూ కూడా నామీద జాలి కూడా చూపించలేదని సింగమనల రమేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+