జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే మహేష్ బాబు, అల్లు అర్జున్

యంగ్ టైగర్ బిరుదుతో పాపులర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు అవసరంలేదు. అతి చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరో అయ్యారు. తన నటనతో, నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో నవరసాలు పోషించగలిగేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అని చెప్పొచ్చు. సీనియర్ నటుడు, విభిన్నమైన పాత్రలతో అందరినీ అలరించిన కోట శ్రీనివాస్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే మిగతా హీరోలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

నవరసాలను పోషిస్తాడు
నటన, నృత్యం.. ఇలా అన్ని విభాగాల్లో తారక్ తన సత్తా చాటుకున్నాడని, చిన్నతనంలోనే అతనిలోని ప్రతిభను గుర్తించిన సీనియర్ ఎన్టీఆర్ తారక్ ను తన ఒళ్లో కూర్చోపెట్టుకొని విజయతిలకం దిద్ది మరీ పరిశ్రమలోకి ఆహ్వానించారన్నారు. ఎంతమంది హీరోలు ఉన్నా ఎన్టీఆర్ అంటేనే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ కూడా మంచి నటులేనని, కానీ వారంతా ఎన్టీఆర్ తర్వాతే అన్నారు. ఎన్టీఆర్ పొట్టిగా ఉంటాడంటున్నారని, చంద్రమోహన్ కూడా పొట్టిగానే ఉండేవాడని, కానీ అతను అద్భుతమైన నటుడని, ఎవరికీ పోటీ కాలేదన్నారు.

telugu senior actor kota srinivasarao comments on junior ntr

కోట అభిప్రాయాన్నే పలువురు చెప్పారు
మొదటినుంచి సినీ పరిశ్రమకు చెందినవారు కూడా కోట చెప్పిన అభిప్రాయాన్నే వ్యక్తం చేసేవారు. నటుడు అన్నతర్వాత అన్ని పాత్రలకు ప్రాణం పోయాలి. అలాగే అన్ని రసాలను అద్భుతంగా పోషించాలి. అటువంటివారు ప్రస్తుత తరంలో ఎవరూ లేరని కోట శ్రీనివాసరావు అభిప్రాయంగా ఉంది. కెమెరాను క్లోజప్ లో పెట్టి నటుడి హావభావాలను చూపించగలిగే దర్శకులెక్కడ ఉన్నారని, అలా పోషించే నటుడు ఎవరని కోట ప్రశ్నిస్తున్నారు. కోట శ్రీనివాసరావు అభిప్రాయంపై సామాజిక మాధ్యమాల్లో ఇతర హీరోల అభిమానులు ఇంత గొప్ప నటుడు ఇలా అనడం సరికాదని, అందరూ ఒకటే అనాలని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 27వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+